జాడలేని రుతుపవనాలు..వరుణుడికోసం పూజలు
బుందేల్‌ఖండ్‌లో రైతులంతా వర్షాల కోసం పూజలు చేసారు. స్ధానిక గోపాల్‌పూర్ గ్రామంలో రైతులు, మహిళలు పెద్దఎత్తున వరుణుని కరుణకోసం ప్రార్ధించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో వానలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని వారు వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు తమ ప్రాంతానికి రుతుపవనాలు రాలేదని అందువల్లే వర్షాలు కురవలేదని తెలిపారు. ప్రతి ఏడాది కురిసినట్టే ఈసారి కూడా సకాలంలో వానలు కురిసే విధంగా వానదేవుడు కరుణించాలని వారు ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. దేశవ్యాప్తంగా పలు […]

బుందేల్‌ఖండ్‌లో రైతులంతా వర్షాల కోసం పూజలు చేసారు. స్ధానిక గోపాల్‌పూర్ గ్రామంలో రైతులు, మహిళలు పెద్దఎత్తున వరుణుని కరుణకోసం ప్రార్ధించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో వానలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని వారు వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు తమ ప్రాంతానికి రుతుపవనాలు రాలేదని అందువల్లే వర్షాలు కురవలేదని తెలిపారు. ప్రతి ఏడాది కురిసినట్టే ఈసారి కూడా సకాలంలో వానలు కురిసే విధంగా వానదేవుడు కరుణించాలని వారు ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నీటి కొరత ఏర్పడింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. తమిళనాడు ప్రభుత్వం నీటికోసం ఇటీవల పెరూర్ ప్రాంతంలో పట్టీశ్వరర్ ఆలయంలో ఒక యఙ్ఞాన్ని సైతం నిర్వహించింది. అలాంటిదే మధురైలో కూడా ఒక యాగాన్ని నిర్వహించారు. మరోవైపు కర్ణాటకలో కూడా పలువురు భక్తులు వానల కోసం భగవద్గీత పారాయణ చేశారు.