నల్లా బిల్లుకు చిల్లు పెట్టిన మహారాష్ట్ర సీఎం
సామాన్యులు నల్లా బిల్లా కట్టకుంటే అధికారులు వారి ఇంటికి నీరు రాకుండా కట్ చేస్తుంటారు. అలాంటిది ఓ రాష్ట్రాన్ని పరిపాలిస్తోన్న సీఎం గత కొన్నేళ్లుగా నల్లా బిల్లు కట్టడం లేదట. ఆయనే కాదు ఆయన కేబినెట్‌లో మంత్రులుగా పనిచేస్తోన్న వారు కూడా నల్లా బిల్లాను ఎగవేశారట. అదంతా రూ.8కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇంతకు ఇదంతా ఏ రాష్ట్రంలో జరిగిదంటే.. మహారాష్ట్రలో. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలోని మలబార్‌హిల్స్ ప్రాంతంలో అధికారిక నివాసం వర్షా […]

సామాన్యులు నల్లా బిల్లా కట్టకుంటే అధికారులు వారి ఇంటికి నీరు రాకుండా కట్ చేస్తుంటారు. అలాంటిది ఓ రాష్ట్రాన్ని పరిపాలిస్తోన్న సీఎం గత కొన్నేళ్లుగా నల్లా బిల్లు కట్టడం లేదట. ఆయనే కాదు ఆయన కేబినెట్‌లో మంత్రులుగా పనిచేస్తోన్న వారు కూడా నల్లా బిల్లాను ఎగవేశారట. అదంతా రూ.8కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇంతకు ఇదంతా ఏ రాష్ట్రంలో జరిగిదంటే.. మహారాష్ట్రలో.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలోని మలబార్‌హిల్స్ ప్రాంతంలో అధికారిక నివాసం వర్షా బంగ్లాలో ఉంటున్నారు. ఆ ఇంటికి 2001 నుంచి ఆయన నీటి బిల్లు కట్టడం లేదు. అప్పటి నుంచి పెండింగ్ బిల్లు రూ.7,44,981కు చేరింది. దీంతో వర్షా బంగ్లాను ఎగవేతదారుగా బీఎంసీ ప్రకటించింది. ఇక మహారాష్ట్ర మంత్రులైన సుధీర్ ముంగతివార్, పంకజ్ ముండే, రామ్‌దాస్ కదమ్ సహా 18 మంది మంత్రులు పేర్లను కూడా బిల్లు ఎగవేత జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బిల్లు కట్టని సీఎం, మంత్రులపై బీఎంసీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోనట్లు సమాచారం.