గుడిలో కొచ్చిన మొసలి.. పూజలు చేసిన భక్తులు
ఎప్పుడూ నీళ్లలో ఉండి బోరు కొట్టిందేమో తెలీదు గానీ.. ఓ మొసలి చిన్నగా పాకుతూ బయటికొచ్చింది. అంతటితో ఆగకుండా అలానే దగ్గర్లో ఉన్న ఓ దేవాలయంలోకి ప్రవేశించింది. అక్కడ అమ్మవారి విగ్రహం వద్దే ఉండిపోయింది. దీంతో దాన్ని చూసిన స్థానికులు సాక్షాత్తూ దేవత వచ్చిందని భావించారు. తాము కొలిచే దేవత వాహనం మొసలి కావడంతోనూ.. అది కూడా అమ్మవారి విగ్రహం దగ్గర ఉండటంతోనూ వెంటనే దానికి పూజలు చేయడం ప్రారంభించారు. పూజల పేరిట దానిపై పసుపు, కుంకుమ […]

ఎప్పుడూ నీళ్లలో ఉండి బోరు కొట్టిందేమో తెలీదు గానీ.. ఓ మొసలి చిన్నగా పాకుతూ బయటికొచ్చింది. అంతటితో ఆగకుండా అలానే దగ్గర్లో ఉన్న ఓ దేవాలయంలోకి ప్రవేశించింది. అక్కడ అమ్మవారి విగ్రహం వద్దే ఉండిపోయింది. దీంతో దాన్ని చూసిన స్థానికులు సాక్షాత్తూ దేవత వచ్చిందని భావించారు. తాము కొలిచే దేవత వాహనం మొసలి కావడంతోనూ.. అది కూడా అమ్మవారి విగ్రహం దగ్గర ఉండటంతోనూ వెంటనే దానికి పూజలు చేయడం ప్రారంభించారు. పూజల పేరిట దానిపై పసుపు, కుంకుమ చల్లి ప్రార్థనలు చేశారు. మొసలి గుడిలో ప్రవేశించిన విషయం తెలిసిన వెంటనే అటవీ అధికారులు అక్కడికి చేరుకొని తరలించేందుకు ప్రయత్నించారు.
అయితే అక్కడే అసలు సంఘటన మొదలైంది. మొసలిని పట్టుకోవద్దంటూ అక్కడున్న వారందరూ అటవీ అధికారులను అడ్డుకున్నారు. ఆ మొసలి దేవతా స్వరూపమని, దాన్ని ముట్టుకోరాదంటూ వారందరూ అధికారులతో వారించారు. దీంతో అక్కడ కాసేపు హైడ్రామా నడిచింది. మొత్తానికి కాసేపటి తరువాత ఎట్టకేలకు స్థానికులను ఒప్పించిన అధికారులు.. దానిని తరలించగలిగారు. ఈ ఘటన గుజరాత్ మహాసాగర్ జిల్లాలోని పల్లా గ్రామంలో జరిగింది. అక్కడ నర్మదా నది దగ్గరగా ఉండటంతో తరచుగా మొసళ్లు బయటకు వస్తుంటాయని.. సంవత్సరానికి 30 నుంచి 35 మొసళ్లను తాము కాపాడుతుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు తాము పట్టుకున్న మొసలి ఆరు అడుగుల ఎత్తు ఉందని, దానికి నాలుగు సంవత్సరాల వయసు ఉండొచ్చని వారు పేర్కొన్నారు. సాధారణంగా పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారు మొసళ్లను తమ కుల దేవత కొడియార్‌గా భావించి కొలుస్తుంటారు.
Gujarat: Forest Department officials yesterday rescued a crocodile that strayed into Khodiyar Mata temple in Mahisagar district; the rescue was allegedly delayed due to the villagers who gathered at the temple to offer prayers to the crocodile. pic.twitter.com/Y5ILxgKTe0
— ANI (@ANI) June 24, 2019