కామాఖ్య టెంపుల్ వద్ద ఏం జరిగింది ?
అస్సాం రాజధాని గౌహతిలోని కామాఖ్య ఆలయ సమీపంలో తల లేని మొండెం కనబడి భక్తులంతా భయాందోళనకు గురయ్యారు. బహుశా నరబలి ఇఛ్చి ఉంటారని అనేకమంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నెల 19 న ఆలయానికి వచ్చిన వందలాది భక్తులు ఇది చూసి దిగ్భ్రాంతి చెందారు. కొంతమంది పోలీసులకు సమాచారమందించారు. ఆ స్థలానికి చేరుకున్న ఖాకీలు దర్యాప్తు మొదలుపెట్టి.. ఇదొక మూఢ నమ్మకంతో కూడిన హత్యగా నిర్ధారణకు వచ్చారు . ఒక మహిళ మృతదేహాన్ని ఓ దుప్పటిలో […]
అస్సాం రాజధాని గౌహతిలోని కామాఖ్య ఆలయ సమీపంలో తల లేని మొండెం కనబడి భక్తులంతా భయాందోళనకు గురయ్యారు. బహుశా నరబలి ఇఛ్చి ఉంటారని అనేకమంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నెల 19 న ఆలయానికి వచ్చిన వందలాది భక్తులు ఇది చూసి దిగ్భ్రాంతి చెందారు. కొంతమంది పోలీసులకు సమాచారమందించారు. ఆ స్థలానికి చేరుకున్న ఖాకీలు దర్యాప్తు మొదలుపెట్టి.. ఇదొక మూఢ నమ్మకంతో కూడిన హత్యగా నిర్ధారణకు వచ్చారు . ఒక మహిళ మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి ఉంచారని, అక్కడే నీటి బాటిల్. ఇతర పూజా సామగ్రి ఉన్నాయని వారు తెలిపారు. సాధారణంగా ఈ గుడి వద్ద తాంత్రిక పూజలు జరుగుతాయని అంటారు. ఈ పూజల సందర్భంగా నరబలులు ఇస్తుంటారని పత్రికలు పేర్కొంటున్నాయి. ‘ అంబుబాచి మేళా ‘ పేరిట సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. ఈ మేళా వెనుక ఓ విచిత్రమైన కథనమొకటి ప్రచారంలో ఉంది.
కామాఖ్య అమ్మవారి రుతుక్రమ సందర్భంగా మూడు రోజులపాటు ఆలయాన్ని మూసివేస్తారని, అనంతరం ఎర్రని వస్త్రాలను భక్తులకు పంచిపెడతారని అంటారు. వీటిని తమ ఇళ్లలో ఉంచుకుంటే శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఇక్కడ ఇలా దారుణ హత్య.జరగడాన్ని హేతువాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాంత్రిక విద్యలు కేవలం మూఢ నమ్మకమని, భక్తులు వీటిని విశ్వసించరాదని వారంటున్నారు. కామాఖ్య ఆలయంలో కొన్ని దశాబ్దాలపాటు ఘనంగా పూజలు జరుగుతుంటాయి. కానీ ఏనాడూ ఇంతటి ఘోర దృశ్యాన్ని భక్తులు చూడలేదు. గుప్త నిధులకోసమో, మరో కోరికతోనో ఇలాంటి దారుణాలకు పాల్పడే దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వీరు కోరుతున్నారు. అస్సాంలోని మారుమూల ప్రాంతాల్లో తరచూ నరబలులు ఇస్తుంటారని, కానీ ఈ గుడి వద్ద ఇంతటి ఘోరం జరగడం ఇదే మొదటిసారని పూజారులు సైతం చెబుతున్నారు. పోలీసులు మాత్రం దీన్ని మర్డర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.