ఎవడైనా సరే తోలు తీస్తాం..ఒంగోలు రేప్ ఘటనపై భగ్గుమన్న రోజా
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒంగోలు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనపై వైసీపీ మహిళా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా స్పందించారు. ‘ఒంగోలులో మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. 10 రోజుల పాటు 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన ఆ కామాంధులకు పడే శిక్షను చూసి ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా శిక్షించాలి’ అని రోజా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. దీంతో […]
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒంగోలు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనపై వైసీపీ మహిళా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా స్పందించారు. ‘ఒంగోలులో మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. 10 రోజుల పాటు 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన ఆ కామాంధులకు పడే శిక్షను చూసి ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా శిక్షించాలి’ అని రోజా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
దీంతో పాటు.. ‘వైఎస్ జగన్ ప్రభుత్వం అంటే ఆడపిల్లలుకు పూర్తి రక్షణ కల్పించే ప్రభుత్వం. ఇప్పటికే మా సోదరి హోమ్ మంత్రి సుచరిత గారు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వెధవలకి కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నా.’ అంటూ మరో ట్వీట్ చేశారు. కాగా ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి సుచరిత నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
ఒంగోలులో మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.10 రోజుల పాటు 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన ఆ కామాంధుల కు పడే శిక్ష ను చూసి ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా శిక్షించాలి.
— Roja Selvamani (@RojaSelvamaniRK) June 24, 2019
.@ysjagan గారి ప్రభుత్వం అంటే ఆడపిల్లలు కు పూర్తి రక్షణ కల్పించే ప్రభుత్వం.ఇప్పటికే మా సోదరి హోమ్ మంత్రి సుచరిత గారు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.ఆడపిల్ల జజీవితాన్ని నాశనం చేసిన వెధవలకి కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నా.
— Roja Selvamani (@RojaSelvamaniRK) June 24, 2019