ఆర్టికల్ 370 రద్దు: కమల్ సంచలన వ్యాఖ్యలు
ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో పాటు జమ్ముకశ్మీర్‌ను విభజించడాన్ని నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది నిరంకుశ చర్య అని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు. ప్రతిపక్షాల కనీస అభిప్రాయాలను తీసుకోకుండా.. కనీసం బిల్లుపై చర్చించే సమయం కూడా ఇవ్వకుండా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. ఈ రద్దుపై కేంద్రం వ్యవహరించిన తీరు వలన ప్రజాస్వామ్యం తిరిగమనదిశగా పయనిస్తుందని కమల్ పేర్కొన్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దు ప్రకటనను […]
ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో పాటు జమ్ముకశ్మీర్‌ను విభజించడాన్ని నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది నిరంకుశ చర్య అని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు. ప్రతిపక్షాల కనీస అభిప్రాయాలను తీసుకోకుండా.. కనీసం బిల్లుపై చర్చించే సమయం కూడా ఇవ్వకుండా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. ఈ రద్దుపై కేంద్రం వ్యవహరించిన తీరు వలన ప్రజాస్వామ్యం తిరిగమనదిశగా పయనిస్తుందని కమల్ పేర్కొన్నారు.
అయితే ఆర్టికల్ 370 రద్దు ప్రకటనను రాజ్యసభలో పలు పార్టీలు వ్యతిరేకించాయి. ముఖ్యంగా కాంగ్రెస్, డీఎంకే, పీడీపీ పార్టీలు ఈ బిల్లుకు మద్దతును ప్రకటించలేదు. అయితే మిగిలిన చాలా పార్టీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలవడంతో రాజ్యసభలో బిల్లు పూర్తి మెజారిటీతో నెగ్గింది. ఇక ఇవాళ ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది.