ఈ నెల 8న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్న వైద్యులు
జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుపై డాక్టర్లు, వైద్య విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ నెల 8న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. వైద్యులంతా విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరింది. జాతీయ వైద్య కమిషన్ చట్టాన్ని (ఎన్ఎంసీ) తొలగించేవరకు పోరాటం కొనసాగించాలని సూచించింది. భారతీయ వైద్య మండలి(ఎంఐఏ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ బిల్లుకు ఇటీవలే పార్లమెంటులో ఆమోదం లభించింది. అయితే బిల్లును […]
జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుపై డాక్టర్లు, వైద్య విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ నెల 8న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. వైద్యులంతా విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరింది. జాతీయ వైద్య కమిషన్ చట్టాన్ని (ఎన్ఎంసీ) తొలగించేవరకు పోరాటం కొనసాగించాలని సూచించింది. భారతీయ వైద్య మండలి(ఎంఐఏ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ బిల్లుకు ఇటీవలే పార్లమెంటులో ఆమోదం లభించింది. అయితే బిల్లును వ్యతిరేకిస్తూ డాక్టర్లు, వైద్య విద్యార్థులు నిరసనలు చేపట్టారు. కార్పొరేట్ ఆస్పత్రులకు మేలు చేసేందుకే కొత్త బిల్లు తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు కూడా ఆందోళనలు చేపట్టినా.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో జరిగిన చర్చలు సఫలమవ్వడంతో వారు ఆందోళన విరమించుకున్నారు. వారి సందేహాలను మంత్రి నివృత్తి చేశారు. వైద్య విద్యలో ఇదో గొప్ప సంస్కరణగా నిలిచిపోతుందని తెలిపారు.