యూరప్ దేశాల్లో తెరుచుకుంటున్న సరిహద్దులు..!

కరోనా కారణంగా మూతపడిన యూరప్ దేశాల బార్డర్లు మూడు నెలల తర్వాత సోమవారం తెరుచుకున్నాయి. యూరప్ యూనియన్ లోని 27 దేశాల్లోని ప్రజలు పాస్ పోర్టు లేకుండానే ప్రయాణించే అవకాశం.

యూరప్ దేశాల్లో తెరుచుకుంటున్న సరిహద్దులు..!
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 16, 2020 | 2:05 PM

కరోనా వైరస్.. ప్రపంచాన్ని కుదేపిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి విశ్వ వ్యాప్తంగా విస్తరించింది. దీంతో అనేక దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఎక్కడికక్కడే రాకపోకలు నిలిచిపోయాయి. ఇక దేశాల ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. ప్రజల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారడంతో అయా దేశాలు సడలింపులు ఇస్తూ తిరిగి వర్తక, వాణిజ్యాన్ని ప్రారంభిస్తున్నాయి. కరోనా కారణంగా మూతపడిన యూరప్ దేశాల బార్డర్లు మూడు నెలల తర్వాత సోమవారం తిరిగి తెరుచుకున్నాయి. యూరప్ యూనియన్ లోని 27 దేశాల్లోని ప్రజలు పాస్ పోర్టు లేకుండానే ప్రయాణించే అవకాశం కల్పించారు. అయితే కరోనా నిబంధనలు మాత్రం అమలులో ఉంటాయని అయా దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం అమెరికన్లు, ఆసియన్లు, ఇతర ఇంటర్నేషనల్ టూరిస్టులను అనుమతించమంటున్నాయి స్విట్జర్లాండ్ తోపాటు మరికొన్ని దేశాలు స్పష్టం చేశాయి. జర్మనీ, ఫ్రాన్స్ బార్డర్ లో సోమవారం తనిఖీలను నిలిపివేశారు. ఇటలీ కూడా తన బార్డర్ ను ఓపెన్ చేసింది. పారిస్ బార్డర్స్, రెస్టారెంట్ల రీఓపెన్ చేశారు. యూరప్ లోని 16 దేశాలకు ప్రయాణించవచ్చని డచ్ గవర్నమెంట్ తన ప్రజలకు అనుమతించింది. టూరిస్టులకు 14 రోజుల క్వారంటైన్ ను సడలించిన స్పెయిన్.. ట్రయల్ రన్ లో భాగంగా వేలాది మంది జర్మన్లు బలియారిక్ ఐలాండ్స్ కు వెళ్లేందుకు అనుమతించింది. . గ్రీస్ లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మొదలయ్యాయి. డెన్మార్క్ నుంచి టూ రిస్టులను జర్మనీ అనుమతించింది. అయితే కొన్ని దేశాలు మాత్రం విదేశాల నుంచి వచ్చే వారి వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని ఇతరులను తమ దేశంలోకి అనుమతించడంలేదు. స్వీడన్ తో ఉన్న బార్డర్లను నార్వే, డెన్మార్క్ మూసివేశాయి. బ్రిటన్ నుంచి వచ్చేవారు సెల్ఫ్ క్వారంటైన్ కావల్సిదేనంటోంది ఫ్రాన్స్. అటు కొన్ని దేశాలు బ్రిటన్ టూరిస్టులకు అనుమతి ఇవ్వడంలేదు.