టీటీడీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయా..?
టీటీడీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్న ప్రచారంపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిధుల దుర్వినియోగంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని అన్నారు. అలాగే.. శ్రీవారి హుండీలో కానుకలు వేయొద్దన్న దుష్ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత మాత్రం సరికాదు. భక్తులు సమర్పించిన కానుకలు దుర్వినియోగం జరగడానికి.. ఎలాంటి అవకాశం లేదు. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి.. రూ.507 కోట్లు కార్పస్ ఫండ్‌లో డిపాజిట్లు చేశాం. భక్తుల సూచనలతో శ్రీవారి సేవకులకు […]

టీటీడీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్న ప్రచారంపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిధుల దుర్వినియోగంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని అన్నారు. అలాగే.. శ్రీవారి హుండీలో కానుకలు వేయొద్దన్న దుష్ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత మాత్రం సరికాదు. భక్తులు సమర్పించిన కానుకలు దుర్వినియోగం జరగడానికి.. ఎలాంటి అవకాశం లేదు. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి.. రూ.507 కోట్లు కార్పస్ ఫండ్‌లో డిపాజిట్లు చేశాం. భక్తుల సూచనలతో శ్రీవారి సేవకులకు శిక్షణ ఇవ్వాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. కాగా.. ఈ నెల 17 నుంచి 19 వరకు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు నిర్వహించనున్నాం. ఈ నెల 23 నుంచి 27 వరకు తిరుమల వరాహస్వామి ఆలయంలో.. బాలాలయ మహాసంప్రోక్షణ జరగనున్నాయని పేర్కొన్నారు ఈవో అనిల్ కుమార్.



