శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 2019 జులై నెలకు సంబంధించి మొత్తం 73,603 టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 10,753 సేవా టికెట్లను కేటాయించింది. సుప్రభాతం 7,953, తోమాల 130, అర్చన 130, అష్టాదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2,300 టికెట్లు విడుదల చేసింది. కరెంట్‌ బుకింగ్‌ కింద 62,850 ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. విశేష పూజ 2,500, […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:18 pm, Fri, 5 April 19
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 2019 జులై నెలకు సంబంధించి మొత్తం 73,603 టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 10,753 సేవా టికెట్లను కేటాయించింది. సుప్రభాతం 7,953, తోమాల 130, అర్చన 130, అష్టాదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2,300 టికెట్లు విడుదల చేసింది. కరెంట్‌ బుకింగ్‌ కింద 62,850 ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. విశేష పూజ 2,500, కల్యాణోత్సవం 14,250, ఊంజల్‌ సేవ 4,500, ఆర్జిత బ్రహ్మోత్సవం 8,250, వసంతోత్సవం 15,950, సహస్ర దీపాలంకరణ 17,400 టికెట్లను టీటీడీ విడుదల చేసింది.