ఇకపై తప్పుడు ఆధార్ ఇస్తే.. భారీ మూల్యం చెల్లించాల్సిందే!

ఈ మధ్యకాలంలో ప్రతీ డాక్యుమెంట్‌కు ఆధార్ తప్పనిసరని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే మనం ఇచ్చిన అధికారిక డాక్యూమెంట్లలో మాత్రం తప్పుడు ఆధార్ ఇస్తే.. భారీ మూల్యం చెల్లిచుకోవాల్సి వస్తుంది. ఇక ఆ జరిమానా 100 లేదా 500 కాదు.. ఏకంగా రూ.10,000 రూపాయలు. రూల్ మారింది… ప్రతి గవర్నమెంట్ డాక్యూమెంట్లకు ఇప్పుడు ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ముఖ్యంగా ఆదాయ పన్నుకు సంబంధించిన వ్యవహారాల్లో అయితే మరీ ఇంపార్టెంట్‌గా అడుగుతున్నారు. ఇక ఆ విషయంలో మాత్రం చాలామంది ఆధార్ […]

ఇకపై తప్పుడు ఆధార్ ఇస్తే.. భారీ మూల్యం చెల్లించాల్సిందే!
Follow us

|

Updated on: Aug 23, 2019 | 6:11 PM

ఈ మధ్యకాలంలో ప్రతీ డాక్యుమెంట్‌కు ఆధార్ తప్పనిసరని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే మనం ఇచ్చిన అధికారిక డాక్యూమెంట్లలో మాత్రం తప్పుడు ఆధార్ ఇస్తే.. భారీ మూల్యం చెల్లిచుకోవాల్సి వస్తుంది. ఇక ఆ జరిమానా 100 లేదా 500 కాదు.. ఏకంగా రూ.10,000 రూపాయలు.

రూల్ మారింది…

ప్రతి గవర్నమెంట్ డాక్యూమెంట్లకు ఇప్పుడు ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ముఖ్యంగా ఆదాయ పన్నుకు సంబంధించిన వ్యవహారాల్లో అయితే మరీ ఇంపార్టెంట్‌గా అడుగుతున్నారు. ఇక ఆ విషయంలో మాత్రం చాలామంది ఆధార్ నంబర్‌ను తప్పుగా కోట్ చేస్తున్నారు. దీని వల్ల చాలా వ్యవహారాల్లో డబుల్ ఎంట్రీలు కామన్ అయిపోయాయి. దానితో అన్ని పనులు ఆలస్యం అవుతున్నాయి. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండడానికే ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది ఇకపై ఎవరైనా ఆధార్ నంబర్ తప్పుగా వేస్తే రూ.10000 జరిమానా కట్టాల్సిందేననే రూల్ పాస్ చేసింది.

భారీ మూల్యం.. ప్రజలకు భారం.. 

ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధార్‌పై సరికొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. ఆదాయ ద్రువీకరణ పత్రాలు సమర్పించేటప్పుడు పాన్ కార్డు బదులు ఆధార్ ఉపయోగించుకోవచ్చని చెప్పిన కేంద్ర మంత్రి రాంగ్ ఆధార్ నంబర్ వేస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. ఆధార్ వల్ల బ్యాంకు అకౌంట్  ఓపెన్ చేయడం.. సిమ్ కార్డు తీసుకోవడం ఇలా చాలా పనులు ఈజీగా అవుతాయని చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి విలువైన వాటికోసం చాలామంది ర్యాండమ్ ఆధార్ నెంబర్లు వేసి మిస్ యూజ్ చేస్తున్నారని అందుకోసం ఈ జరిమానా విధిస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక ఈ కొత్త నిబంధన 2019 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.