AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖర్చుల లెక్కలు చూపండి: ఎన్నికల సంఘం నోటీసులు

గత డిసెంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల ఖర్చుల వివరాలపై ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తెలంగాణాలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 1,821 మంది అభ్యర్ధులు పోటీచేసారు. వీరందరిలో 1,702 మంది ఓటమిపాలయ్యారు.  ఇప్పటికి ఆరునెలలు గడుస్తున్నా వీరు ఖర్చుల వివరాలు వెల్లడించలేదు. రూల్స్ ప్రకారం 45 రోజుల్లోగా  ఎన్నికల్లో చేసిన ఖర్చులను  అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. పోటీ చేసిన అభ్యర్ధులు తమ ఖర్చుల వివరాలును ఎన్నికల సంఘం రూపొందించిన విధానంలో […]

ఖర్చుల లెక్కలు చూపండి: ఎన్నికల సంఘం నోటీసులు
Anil kumar poka
| Edited By: |

Updated on: Jun 19, 2019 | 4:53 PM

Share

గత డిసెంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల ఖర్చుల వివరాలపై ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తెలంగాణాలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 1,821 మంది అభ్యర్ధులు పోటీచేసారు. వీరందరిలో 1,702 మంది ఓటమిపాలయ్యారు.  ఇప్పటికి ఆరునెలలు గడుస్తున్నా వీరు ఖర్చుల వివరాలు వెల్లడించలేదు. రూల్స్ ప్రకారం 45 రోజుల్లోగా  ఎన్నికల్లో చేసిన ఖర్చులను  అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది.

పోటీ చేసిన అభ్యర్ధులు తమ ఖర్చుల వివరాలును ఎన్నికల సంఘం రూపొందించిన విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.  ఇప్పటివరకు స్పందించకపోవడంతో  52 మందికి ఎన్నికల సంఘం  నోటీసులు జారీ చేసింది. నియమాల ప్రకారం  మూడు దఫాలు నోటీసులు జారీ చేస్తారు. అప్పటికీ స్పందించకపోతే అలాంటి వారిపై ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా అనర్హత వేటు వేస్తారు.

ఇప్పటివరకు తొలివిడతగా 77 మందికి నోటీసులు సర్వ్ చేశారు. వీరిలో 20 మంది స్పందించి తమ ఖర్చుల వివరాలను అందజేశారు. ఇక వచ్చే నెలలో మరో దఫా నోటీసులు జారీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల వ్యయాల వివరాలు వెల్లడించేందుకు గడువు జూన్ నెలాఖరుతో ముగియనున్నట్టుగా ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.

Follow Us
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి