ఇక్కడేమో ఇలా…అక్కడేమో అలా.. భారత్‌లో దంచికొడుతున్న వర్షాలు.. గల్ఫ్‌లో మండుతున్న ఎండలు
ఓ వైపు భారీ వర్షాలు, వరదలతో ఇండియా తల్లడిల్లుతుండగా... మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా దుబాయ్ లో ఇంచుమించు ప్రతి రోజూ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతోంది.
ఓ వైపు భారీ వర్షాలు, వరదలతో ఇండియా తల్లడిల్లుతుండగా… మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా దుబాయ్ లో ఇంచుమించు ప్రతి రోజూ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. భరించలేని ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఏసీలు, ఎయిర్ కూలర్లు కూడా వీరిని ఆదుకోలేకపోతున్నాయి. సమీప భవిష్యత్తులో వర్షాలు పడే సూచనలు లేకపోవడంతో ఇక కృత్రిమ వర్షాలపై ఆధారపడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం డ్రోన్లను వినియోగించి మేఘాల్లోకి పంపాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఇవి మేఘాల్లోకి వెళ్లి ఎలెక్ట్రికల్ చార్జీలను విడుదల చేస్తాయని, దీంతో మేఘాలు వర్షం కురిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీన్నే ‘క్లౌడ్ సీడింగ్’ అని కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే మొదటిసారి ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో కృత్రిమ వర్షం కురిపించారు. ఇది బాగానే ఉంది గానీ ఈ టెక్నాలజీ వికటించి మరీ భారీ వర్షాలు పడినా పడవచ్చునని కూడా ఆందోళన చెందుతున్నారు.
క్లౌడ్ సీడింగ్ కి లక్షల రూపాయలు ఖర్చవుతాయి. కానీ ప్రస్తుతం ఈ ప్రయోగాన్ని యుద్ధ ప్రాతిపదికన చేబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. డ్రోన్లను వాడడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఎల్లో వార్నింగ్ హెచ్చరికలు జారీ చేశారు. డ్రోన్ల ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించవచ్చునని బ్రిటన్ కు చెందిన ప్రొఫెసర్ మార్టెన్ అంబౌమ్ ప్రచారం చేస్తున్నారు. నిజానికి 2017 నుంచే దుబాయ్ లోని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియోలజీ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తూ వచ్చింది. క్లౌడ్ సీడింగ్ ప్రయోగానికి లక్షల సొమ్ము వ్యయమయినప్పటికీ ప్రజలే ప్రయోజనాలే ముఖ్యమని ఈ సంస్థ చెబుతోంది. ఎండలు భరించలేక దుబాయ్వాసుల్లో చాలామంది చల్లని వాతావరణం గల విదేశాలకు తరలుతున్నారు.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చూడండి: భూమికి మరో ముప్పు..!! దూసుకొస్తున్న ఆస్టరాయిడ్..!! తాజ్ మహల్ కంటె మూడు రెట్లు పెద్దది..!! వీడియో
Viral Video: కోతి పిల్లను ఫొటో తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తి..!! ఝలక్ ఇచ్చిన తల్లి కోతి..!! వీడియో