మందేసి చిందేసిన ఆర్టీసీ డ్రైవర్
విధులు నిర్వహించే సమయంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ తాగొచ్చి నానా హంగామా చేశాడు. తాగొచ్చా.. ఐతే ఏంటి..? నన్నెవరూ ఏమీ చేయలేరంటూ చిందులు తొక్కాడు. ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 21జడ్ 0772 నంబర్ గల బస్సు సోమవారం రాత్రి హైదరాబాద్కు వెళ్లేందుకు మంత్రాలయం చేరుకుంది. డిపో నుంచి బస్సు బయలుదేరే సమయంలో డ్రైవర్ కృష్ణకు బ్రీత్ ఎనలైజింగ్ టెస్టు చేసి పంపించారు. అయితే.. అతను మార్గమధ్యలో మద్యం సేవించి బస్సు నడిపాడని ప్రయాణికులు చెబుతున్నారు. […]
విధులు నిర్వహించే సమయంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ తాగొచ్చి నానా హంగామా చేశాడు. తాగొచ్చా.. ఐతే ఏంటి..? నన్నెవరూ ఏమీ చేయలేరంటూ చిందులు తొక్కాడు. ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 21జడ్ 0772 నంబర్ గల బస్సు సోమవారం రాత్రి హైదరాబాద్కు వెళ్లేందుకు మంత్రాలయం చేరుకుంది. డిపో నుంచి బస్సు బయలుదేరే సమయంలో డ్రైవర్ కృష్ణకు బ్రీత్ ఎనలైజింగ్ టెస్టు చేసి పంపించారు. అయితే.. అతను మార్గమధ్యలో మద్యం సేవించి బస్సు నడిపాడని ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో అతని పై డీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అతని స్థానంలో మరో డ్రైవర్ను పంపారు. కాగా, మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కృష్ణ ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించాడు.