Antibiotics defects: విచ్చలవిడి యాంటీ బయాటిక్స్‌తో పెను ప్రమాదం.. కరోనా కాలంలో మరింత డేంజర్‌.. హెచ్చరిస్తోన్న ఆరోగ్య నిపుణులు..

కాళ్లునొప్పులా?... ఈ మందు గోళీ వేసుకుంటే సరి. రొంప చేసిందా?... ఈ మందు బిళ్ల వేసుకుంటే పోతుంది. వైరస్‌ లక్షణాలు ఉన్నాయా?.. ఈ ట్యాబ్లెట్స్ వారం రోజులు వాడితే నయమవుతుంది. ఇదీ ఇప్పుడు ట్రెండ్. కానీ ఈ ట్రెండే

Antibiotics defects: విచ్చలవిడి యాంటీ బయాటిక్స్‌తో పెను ప్రమాదం.. కరోనా కాలంలో మరింత డేంజర్‌.. హెచ్చరిస్తోన్న ఆరోగ్య నిపుణులు..

కాళ్లునొప్పులా?.. ఈ మందు గోళీ వేసుకుంటే సరి. రొంప చేసిందా?.. ఈ మందు బిళ్ల వేసుకుంటే నయమైపోతుంది. వైరస్‌ లక్షణాలు ఉన్నాయా?.. ఈ ట్యాబ్లెట్స్ వారం రోజులు వాడితే తగ్గిపోతుంది. ఇదీ ఇప్పుడు ట్రెండ్. కానీ ఈ ట్రెండే ఇప్పుడు పెను ముప్పుగా మారుతోంది. అవును.. విచ్చలవిడిగా వాడుతున్న యాంటీబయాటిక్స్ వల్ల…తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడే ప్రమాదం ఉంది. చివరికి ఇవి ఎలా తయారవుతాయంటే మన ఒంటికి ఏ మందు పనిచేయని దారుణ పరిస్థితిని కల్పిస్తాయి.. ఇక కరోనా మహమ్మారి కాలంలో యాంటీ బయాటిక్స్‌ విచ్చల విడిగా వాడడం అత్యంత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైతే వైద్య నిపుణులను సంప్రదించాలని, వారు సూచిస్తేనే వాడాలని లేకపోతే వీలైనంతవరకు దూరంగా ఉండాలంటున్నారు.

వీటికి దూరంగా ఉండాలి.. azithromycin, amoxicillin, doxycycline, cephalexin, ciprofloxacin, clindamycin, metronidazole, sulfamethoxazole, trimethoprim… ఇవి ప్రధానంలో వాడుకలో ఉన్న యాంటీ బయాటిక్స్‌. సుదీర్ఘకాలం వీటిని వాడడం వల్ల ఇప్పుడు చాలా మందికి ఈ టాబ్లెట్స్ పని చేయడంలేదు. కొద్ది కాలం క్రితం వరకూ ఇది ఒక సమస్య మాత్రమే. కానీ కరోనా కాలంలో ఈ మందులు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. వీటిని ఎక్కువ కాలం పాటు వినియోగించడం వల్ల చాలామంది ఈ టాబ్లెట్లు పనిచేయని దశను అధిగమించి మరింత డేంజర్‌లో పడ్డారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిర్వీర్యం అవుతున్నాయి… ‘యాంటీ బయాటిక్స్‌తో కలిగే ముప్పును డ్రగ్‌ కంట్రోల్‌ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. వీటి వాడకం వల్ల తీవ్ర ప్రతికూల పరిణామాలను ఎదుర్కోంటారని హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. జారీచేస్తోంది. ఎంతో పరిశోధనన చేసి కనుగొన్న యాంటీ బయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడడం వల్ల నిర్వీర్యం అవుతున్నాయి. ఏ ఉద్దేశంతో వీటిని తయారుచేశారో ఆ ప్రయోజనం నెరవేరడం లేదు.   ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే… ఇప్పుడున్న యాంటీబయాటిక్స్ తె భవిష్యత్‌లో ఎలాంటి ప్రయోజనముండదు. అందుకే మందుల వాడకంపై అవగాహన కల్పిస్తున్నాం. డాక్టర్ల ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా మందుల అమ్మకాలు సాగించే షాపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం’  అని  తెలంగాణ డ్రగ్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ రామ్ ధన్ పేర్కొన్నారు.

‘ వైద్యుల సూచనల ప్రిస్ర్కిప్షన్‌ లేకుండానే చాలామంది ఈ మందులు వేసుకుంటున్నారు. అది కూడా మోతాదుకు మించి తీసుకుంటున్నారు. ఫలితంగా ఈ మందులు పనిచేయకపోవడమే కాదు.. వారి ఆరోగ్యం సైతం ప్రమాదంలో పడుతోంది. వీటి వాడకంపై అవగాహన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది’ అని జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్ లక్ష్మికాంత్‌ రెడ్డి హెచ్చరిస్తున్నారు.  ‘చాలామంది యాంటీ బయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడుతున్నారు. రొంప.. జలుబు..ఒళ్లునొప్పులు.. ఇలా ఏదైనా సరే. ఒక టాబ్లెట్ వేసుకోవడం చాలా మందికి అలవాటుగా మారిపోయిందే. ఇదే ఇప్పుడు కొంప ముంచుతోంది’ అని మరో వైద్యుడు హెచ్చరిస్తున్నారు.

నిబంధనలు పాటించకపోవడం వల్లే…

‘ మానవ శరీరంలో అనారోగ్యాన్ని కల్గించే బ్యాక్టీరియాతో పాటు ఆరోగ్య వంతమైన బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. యాంటీ బయాటిక్స్‌ను ఇష్టమొచ్చినట్లు తీసుకుంటే శరీరంలోని మంచి బ్యాక్టీరియా నాశనమైపోతుంది. ఇది మరింత ప్రమాదం. మన దగ్గర యాంటీ వైరల్‌ మందులు తక్కువ కాబట్టి.. యాంటీ బ్యాక్టీరియా డ్రగ్స్ వాడకం ఎక్కువగా జరుగుతోంది.  చాలా మంది పాత మందుల చీటీలుఉపయోగించి మెడిసిన్స్ కొంటున్నారు. మరికొందరు ఆన్‌లైన్ లో కొనుగోలు చేస్తున్నారు. ఇంకా వాట్సాప్ ప్రిస్ర్కిప్షన్ల తోనూ యాంటీ బయాటిక్స్‌ను కొనుగోలు చేస్తున్నవారున్నారు.  కరోనా కాలంలో ఇది మరింత ఎక్కువైంది. ఇలా నిబంధనలు పాటించకుండా నేరుగా అమ్మకాలు చేస్తున్న మెడికల్‌ షాపులు కొన్ని ఉంటే.. వీటిని విక్రయించకపోతే తమపై దాడులు చేస్తున్నారని మరికొందరు మెడికల్‌ షాపు యజమానులు వాపోతున్నారు. ఈపరిస్థితి మారాల్సిన అవసరముంది’ అని ప్రముఖ న్యూరాలజీ స్పెషలిస్టు డాక్టర్ విక్రమ్ రెడ్డి సూచిస్తున్నారు. Also Read:

Egg Secret: గుడ్డు శాఖాహారమా? మాంసాహారమా? గుట్టురట్టు చేసిన శాస్త్రవేత్తలు.. మరి మన శాస్త్రాలు ఏంచెబుతున్నాయి..?

India Covid Vaccines: ఒమిక్రాన్ బాధిత దేశాలకు వ్యాక్సిన్ సరఫరా.. అత్యవసర మందులను అందించడానికి భారత్ రెడీ..

Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ ఎఫెక్ట్ .. కీలక నిర్ణయాలు తీసుకున్న అమెరికా

Click on your DTH Provider to Add TV9 Telugu