మధ్యాహ్నం ద్రోణంరాజు శ్రీనివాసరావు అంతిమయాత్ర

విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్డీఏ) చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు (59) అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం జరుగనున్నాయి. గతకొలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కరోనా నుండి కోలుకున్నప్పటికీ… ఆరోగ్యం క్షీణించడంతో విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ద్రోణంరాజు శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ద్రోణ౦రాజు మృతదేహాన్ని ఆసుపత్రి నుండి అతని నివాసానికి ఈ ఉదయం తీసుకువచ్చారు. ఇంటివద్ద ఆయన పార్థీవదేహాన్ని ప్రజల […]

మధ్యాహ్నం ద్రోణంరాజు శ్రీనివాసరావు అంతిమయాత్ర
Venkata Narayana

|

Oct 05, 2020 | 10:05 AM

విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్డీఏ) చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు (59) అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం జరుగనున్నాయి. గతకొలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కరోనా నుండి కోలుకున్నప్పటికీ… ఆరోగ్యం క్షీణించడంతో విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ద్రోణంరాజు శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ద్రోణ౦రాజు మృతదేహాన్ని ఆసుపత్రి నుండి అతని నివాసానికి ఈ ఉదయం తీసుకువచ్చారు.

ఇంటివద్ద ఆయన పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత అంతిమయాత్ర నిర్వహిస్తారు. పెద్ద వాల్తేర్ డాక్టర్స్ కాలనీ వద్ద అంతిమయాత్ర మొదలై కరకచెట్టు పోలమాంబ దేవాలయం, సిరిపురం, జగదాంబ సె౦టర్, పూర్ణ మార్కెట్. కురుపాం మార్కెట్, పాత పోస్ట్ ఆఫీస్, దుర్గాలమ్మ అమ్మ వారి గుడి మీదుగా, మనోరమ థియేటర్, కొబ్బరి తోట, కాన్వెంట్ జంక్షన్ కి చేరకుని అక్కడున్న హిందూ స్మశాన వాటికలో ద్రోణంరాజు అంత్యక్రియలు నిర్వహి౦చనున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu