‘కార్తికేయ 2’ సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే

నిఖిల్‌ హీరోగా చందు మొండేటి కార్తికేయ 2ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. 2014లో వచ్చిన కార్తికేయ సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది.

'కార్తికేయ 2' సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 05, 2020 | 10:46 AM

Nikhil Karthikeya 2 movie: నిఖిల్‌ హీరోగా చందు మొండేటి కార్తికేయ 2ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. 2014లో వచ్చిన కార్తికేయ సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. మార్చిలో ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తి అవ్వగా.. మూవీ షూటింగ్‌ని డిసెంబర్‌లో ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఇందులో ఓ హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ ఖరారు అయినట్లు సమాచారం. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీపై నిఖిల్‌ చాలా అంచనాలు పెట్టుకున్నారు. కాగా మరోవైపు సుకుమార్ రైటింగ్స్‌ నిర్మాణంలో నిఖిల్‌ 18 పేజెస్‌ అనే చిత్రంలో నటించనున్నారు. కరెంట్‌, కుమారి 21 f సినిమాల దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు.

Read More:

కరోనా ఎఫెక్ట్‌.. దేవరగట్టు బన్నీ ఉత్సవం రద్దు

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2లక్షలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య