Bigg Boss 4: ఆ ఆరుగురిని టెన్షన్ పెట్టి, కూల్ చేసిన నాగార్జున
శనివారం నాటి ఎపిసోడ్‌లో స్వాతి ఎలిమినేట్ అయిన తరువాత నాగార్జున మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. నామినేషన్‌లో ఉన్న ఏడుగురిలో తాను ఎవరినీ సేవ్ చేయలేదని నాగ్ ట్విస్ట్ ఇచ్చారు.
Bigg Boss 4 Update: శనివారం నాటి ఎపిసోడ్‌లో స్వాతి ఎలిమినేట్ అయిన తరువాత నాగార్జున మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. నామినేషన్‌లో ఉన్న ఏడుగురిలో తాను ఎవరినీ సేవ్ చేయలేదని నాగ్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అవుతుందని అందరూ భావించారు. ఇక హౌజ్‌లో ఉన్న సభ్యులకు కూడా ఈ టెన్షన్‌తో చెమటలు పట్టాయి.
ఇక ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ నామినేషన్‌లో ఉన్న ఆరుగురిని హౌస్‌లో వారి ప్రాధాన్యతను బట్టి నిలబడమన్నారు. దీంతో మొదటి స్థానంలో అభిజిత్, రెండో స్థానంలో మెహబూబ్, మూడో స్థానంలో లాస్య నిలబడ్డారు. మిగిలిన స్థానాల్లో నిలబడే విషయంలో బేధాప్రియాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారి పనితీరు ఆధారంగా అరియానా.. కుమార్, సోహైల్, హారికలను వరుసగా 4,5,6 స్థానాల్లో నిలబెట్టింది. అవినాష్, అఖిల్ మాత్రం సోహైల్ నాలుగో స్థానంలో ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు మాత్రం ఇక్కడున్న స్థానాలకు వ్యతిరేకంగా ఉన్నారని బాంబు పేల్చారు. ఈ టెన్షన్ అందరిలో కొనసాగుతుంటే.. కానీ వాళ్లే మీ అందరినీ సేఫ్ చేశారని నాగ్ చెప్పేశారు. దీంతో ఈ వారం గండం గట్టెక్కామని నామినేటెడ్ కంటెస్టెంట్లు ఊపిరి పీల్చుకున్నారు.
Read More:
Bigg Boss 4: ‘జంబలకిడి పంబ’ ఫన్.. సొహైల్‌ని చూసి విజిల్ వేసిన నాగ్