Bigg Boss 4: ‘జంబలకిడి పంబ’ ఫన్.. సొహైల్‌ని చూసి విజిల్ వేసిన నాగ్
ఎప్పటిలాగే బిగ్‌బాస్‌లో సండే ఫన్‌డేగా సాగింది. స్వాతి ఎలిమినేట్ తరువాత హౌజ్‌లోని కంటెస్టెంట్‌లతో జంబలకిడి పంబ స్కిట్ వేయించారు
Gender Equality task: ఎప్పటిలాగే బిగ్‌బాస్‌లో సండే ఫన్‌డేగా సాగింది. స్వాతి ఎలిమినేట్ తరువాత హౌజ్‌లోని కంటెస్టెంట్‌లతో జంబలకిడి పంబ స్కిట్ వేయించారు. హౌజ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ సమానమేనని స్పష్టం చేసిన నాగ్.. వారి చేత ఈ స్కిట్ వేయించారు. ఈ క్రమంలో హౌజ్‌లో ఆడవాళ్లు, మగవాళ్లుగా.. మగవాళ్లు, ఆడవారిలా తయారయ్యారు. ఇక నాగార్జున వారి పేర్లను కూడా మార్చేశారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు బయటకు రాగా సోనాల్(సోహైల్)ని చూసి నాగ్ విజిల్ వేశారు. అమ్మాయిని పిలవలేదు కదా అని భ్రమపడ్డారు.
కాగా జంబలకిడి పంబలో భాగంగా కంటెస్టెంట్‌లు చేసిన అల్లరి వీక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఒకరికొకరు ర్యాంగింగ్ చేసుకోవడం చాలా ఫన్నీగా అనిపించింది. ఇక డ్యూయెట్ సాంగ్స్‌లో మెహబూబ్, లాస్య ఇరగదీశారు. అమ్మాయిగా కూడా మెహబూబ్ మంచి గ్రేస్‌తో డ్యాన్స్ చేశారు. ఆ తరువాత ఖుషీ సినిమాలో నడుము చూసే సీన్‌ని అవినాష్, హారికలు చేశారు. వీరిద్దరు చేసింది పెద్దగా ఆకట్టుకోలేదు. అనంతరం అఖిల్, మోనాల్‌లు దివాళీ దీపాన్ని పాటకు మంచి గ్రేస్‌తో డ్యాన్స్ వేశారు. చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి, సొందర్యల మధ్య కవిత చదివి వినిపించే సీన్‌ని అమ్మ రాజశేఖర్, సుజాతలు చాలా బాగా చేశారు. ఇక గంగవ్వ, కుమార్ సాయిలు రత్తాలు వస్తావా పాటకు వేసిన స్టెప్‌లు బావున్నాయి. అలాగే అతడు సినిమాలో మహేష్, త్రిషల మధ్య సీన్‌ని నోయెల్, దివి దించేశారు. ఇక ఓసోసి రత్తాలు పాటకు అరియానా, సొహైల్‌ల డ్యాన్స్, నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి నా కళ్లు పాటకు అభి, హారిక డ్యాన్స్ బావున్నాయి. ఫైనల్‌గా సాంగ్స్‌లో అరియానా-సోహైల్ జంట బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ అని, అమ్మ రాజశేఖర్-సుజాత జంట సీన్‌లో బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ చేశారని నాగార్జున అన్నారు.
Read More: