Drinking Wine: రోజూ గ్లాస్ వైన్‌తో.. ఎక్కువ కాలం బ్రతకవచ్చునట..
Drinking Wine: మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఆల్కహాల్ అధికంగా సేవించడం వల్ల లివర్ పాడవుతుంది. ఈ డైలాగులు నిత్యం మనం వింటూ ఉంటాం. అయితే మద్యం తీసుకోవడం వల్ల ఒక్క లివర్ మాత్రమే కాదు కిడ్నీ, ఇతర దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తాయి. అందుకే వైద్యులు మందు తాగకూడదని సూచిస్తారు. అయితే పరిమిత మోతాదులో మద్యం సేవిస్తే ఆరోగ్యానికి లాభమని కూడా వాళ్ళే చెబుతుంటారు. ఈ క్రమంలోనే రోజుకు ఒకటి లేదా రెండు పెగ్గుల వైన్ తాగితే […]
Drinking Wine: మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఆల్కహాల్ అధికంగా సేవించడం వల్ల లివర్ పాడవుతుంది. ఈ డైలాగులు నిత్యం మనం వింటూ ఉంటాం. అయితే మద్యం తీసుకోవడం వల్ల ఒక్క లివర్ మాత్రమే కాదు కిడ్నీ, ఇతర దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తాయి. అందుకే వైద్యులు మందు తాగకూడదని సూచిస్తారు. అయితే పరిమిత మోతాదులో మద్యం సేవిస్తే ఆరోగ్యానికి లాభమని కూడా వాళ్ళే చెబుతుంటారు. ఈ క్రమంలోనే రోజుకు ఒకటి లేదా రెండు పెగ్గుల వైన్ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటారు. అసలు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: Health Benefits With Guava
నిత్యం వైన్ తాగితే గుండె జబ్బులు దరికి చేరవట. అలాగే రక్త సరఫరా కూడా మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాక వైన్ సేవించడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలినట్లు తెలుస్తోంది. మరోవైపు వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రావని హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు స్పష్టం చేశారు.
అటు రోజుకి ఒక్క గ్లాస్ వైన్ తాగడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుందట. అంతేకాక డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా 30 శాతం వరకు తక్కువగా ఉంటాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.