5

మద్యం దొరికిందోచ్…ఎవరెస్ట్‌ ఎక్కినంత సంబరంలో మందుబాబులు..

ఆంధ్రప్రదేశ్‌లో బాటిల్‌ బ్యాటల్‌ మొదలయ్యింది. రాష్ట్రంలో మద్యం విక్రయాలకు ఆమోదం లభించడంతో మందుబాబులకు ఎడారిలో ఒయాసిస్‌ కనిపించినంత ఆనందంగా ఉంది. ఎంత వీలైతే అంత ముందుగా వెళ్లి ఓ బాటిల్‌ తెచ్చుకుందామనుకున్నారు. దీంతో ప్రతి వైన్‌షాపు ముందు చాంతాండంత క్యూలు కనిపిస్తున్నాయి. పెగ్గేయ్యాలంటే కాసింత రేటు ఎక్కువ పెట్టాల్సి వస్తుందిప్పుడు. అయినా లెక్కచెయ్య‌డం మందుబాబులు. ఎంత పెంచితే ఏమిటి..? అసలు షాపు తెరవడమే పది వేలు అన్నట్టుగా ఫీలవుతున్నారు. సాయంత్రం 7 గంటల వరకే అమ్మకాలు సాగుతాయి […]

మద్యం దొరికిందోచ్...ఎవరెస్ట్‌ ఎక్కినంత సంబరంలో మందుబాబులు..
Follow us

|

Updated on: May 04, 2020 | 3:04 PM

ఆంధ్రప్రదేశ్‌లో బాటిల్‌ బ్యాటల్‌ మొదలయ్యింది. రాష్ట్రంలో మద్యం విక్రయాలకు ఆమోదం లభించడంతో మందుబాబులకు ఎడారిలో ఒయాసిస్‌ కనిపించినంత ఆనందంగా ఉంది. ఎంత వీలైతే అంత ముందుగా వెళ్లి ఓ బాటిల్‌ తెచ్చుకుందామనుకున్నారు. దీంతో ప్రతి వైన్‌షాపు ముందు చాంతాండంత క్యూలు కనిపిస్తున్నాయి. పెగ్గేయ్యాలంటే కాసింత రేటు ఎక్కువ పెట్టాల్సి వస్తుందిప్పుడు. అయినా లెక్కచెయ్య‌డం మందుబాబులు. ఎంత పెంచితే ఏమిటి..? అసలు షాపు తెరవడమే పది వేలు అన్నట్టుగా ఫీలవుతున్నారు.

సాయంత్రం 7 గంటల వరకే అమ్మకాలు సాగుతాయి కాబట్టి కొంద‌రు ఎలాగైనా లిక్క‌ర్ అందుకునేందుకు నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడుస్తున్నారు. 5 గురు మాత్ర‌మే షాపు వ‌ద్ద ఉండాల‌న్న రూల్ పక్క‌న‌బెట్టి భారీ సంఖ్య‌లో క్యూ లైన్లలో ద‌ర్శ‌న‌మిస్తున్నారు. వైన్‌ షాపుల దగ్గర చాంతాడంత క్యూలు.. ఎండ చుర్రుమంటున్నా గొడుగులు వేసుకుని క్యూలో నిల్చుంటున్నారు. గొడుగులు లేనివాళ్లు ఆకులు కప్పుకుని మరీ లైన్‌లో నిల్చుంటున్నారు. నరాలు జివ్వుమంటున్నాయని ఓ బాటిల్‌ ఇప్పించండి అంటూ దీనంగా వేడుకుంటున్నారు.. ఇక మద్యం కొనుగోలు చేయడానికి మహిళలు క్యూలైన్లలో నిల్చుంటున్నారు. మద్యం అమ్మకాలు ప్రారంభం కాగానే బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారు . ఇక మగవాళ్లైతే మందు బాటిల్ దొరకగానే ఆప్యాయంగా వాటిని ముద్దాడుతున్నారు .. వరల్డ్ కప్ గెలిచినంతగా సంబరపడిపోతున్నారు .