అగ్నికీలలలో చిక్కుకున్న 33 అంతస్తుల భవంతి
ది టవరింగ్ ఇన్‌ఫెర్నో అనే ఇంగ్లీషు సినిమా చూశారా? ఏడో దశకంలో వచ్చిన ఈ సినిమాలో వంద అంతస్తులపైనే ఉన్న ఓ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటుంది.. అందులో ఉన్నవారిని ఎలా రక్షించారు? ఆ మంటలను ఎలా ఆర్పారన్నదే కథ.. అప్పట్లో చూడని వాళ్లు దక్షిణకొరియాలోని ఉల్సాన్ నగరంలో జరిగిన అగ్నిప్రమాదం చూస్తే సరి! అచ్చం సినిమాలోలాగే 33 అంతస్తుల పెద్ద భవంతి అగ్ని కీలలలో చిక్కుకుంది.. ఆ అపార్ట్‌మెంట్‌లోని 12వ అంతస్తులో తొలుత మంటలు […]
ది టవరింగ్ ఇన్‌ఫెర్నో అనే ఇంగ్లీషు సినిమా చూశారా? ఏడో దశకంలో వచ్చిన ఈ సినిమాలో వంద అంతస్తులపైనే ఉన్న ఓ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటుంది.. అందులో ఉన్నవారిని ఎలా రక్షించారు? ఆ మంటలను ఎలా ఆర్పారన్నదే కథ.. అప్పట్లో చూడని వాళ్లు దక్షిణకొరియాలోని ఉల్సాన్ నగరంలో జరిగిన అగ్నిప్రమాదం చూస్తే సరి! అచ్చం సినిమాలోలాగే 33 అంతస్తుల పెద్ద భవంతి అగ్ని కీలలలో చిక్కుకుంది.. ఆ అపార్ట్‌మెంట్‌లోని 12వ అంతస్తులో తొలుత మంటలు వ్యాపించాయి.. అదేం చిత్రమో అగ్నికీలలు కిందకు పాకి 8వ అంతస్తు వరకు చేరుకున్నాయి.. మంటలు భారీగా ఎగిసిపడుతుండంతో ప్రాణభీతితో కొందరు బిల్డింగ్ పైకి వెళ్లారు.. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.. గాలులు బలంగా వీయడం వల్ల త్వరితగతిన మంటలు వ్యాపించాయని అధికారులు అంటున్నారు.. ఈ ప్రమాదంలో గాయపడిన ఓ 88 మందిని దగ్గరలోని ఆసుప్రతిలో చేర్పించారు..