AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్షా 10 వేల కిలోమీటర్ల దగ్గరే ప్రతిష్టంభన..: ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు

మంత్రుల స్థాయి చర్చలతోనే అంతర్‌ రాష్ట్ర సర్వీసులపై స్పష్టత వస్తుందని ఏపీ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అన్నారు. ఇరు రాష్ట్రాలు లక్షా 60 వేల కిలోమీటర్లు తిప్పుదామని టీఎస్‌ ఆర్టీసీ అంటోందని, ఏపీ తిప్పుతున్న లక్షా 10 వేల కిలోమీటర్ల దగ్గరే ప్రతిష్టంభన ఏర్పడిందని అన్నారు...

లక్షా 10 వేల కిలోమీటర్ల దగ్గరే ప్రతిష్టంభన..: ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు
Sanjay Kasula
|

Updated on: Oct 09, 2020 | 6:51 PM

Share

APSRTC MD Krishna Babu : మంత్రుల స్థాయి చర్చలతోనే అంతర్‌ రాష్ట్ర సర్వీసులపై స్పష్టత వస్తుందని ఏపీ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అన్నారు. ఇరు రాష్ట్రాలు లక్షా 60 వేల కిలోమీటర్లు తిప్పుదామని టీఎస్‌ ఆర్టీసీ అంటోందని, ఏపీ తిప్పుతున్న లక్షా 10 వేల కిలోమీటర్ల దగ్గరే ప్రతిష్టంభన ఏర్పడిందని అన్నారు. లక్షా 10 వేల కిలోమీటర్లు బస్సులు తగ్గించండని తెలంగాణ ఆర్టీసీ చెబుతోందన్నారు.

అయితే తాము తగ్గిస్తాం.. మీరు పెంచండి అంటే తెలంగాణ కుదరదంటోందని ఎండీ కృష్ణబాబు వెల్లడించారు. ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు తగ్గిస్తే ప్రైవేట్ ట్రావెల్స్‌కి లబ్ధి చేకూతుందన్నారు. తాము లక్ష 10 వేల కిలోమీటర్లు తగ్గిస్తే ప్రైవేట్ బస్సులు పెరుగుతాయని, లక్ష 60 వేల కిలోమీటర్లు తిప్పటానికి తాము సిద్ధమని చెప్పామని, అది తేలే వరకు ముందుగా 70 వేల కిలోమీటర్లు తిప్పుదామని ప్రతిపాదన పెట్టామని వెల్లడించారు. ప్రతిపాదనపై టీఎస్‌ ఆర్టీసీ నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదని కృష్ణబాబు టీవీ9తో అన్నారు. అయితే ఆర్టీసీ దసర సమయం చాలా కీలకమని అన్నారు.

అంతర్రాష్ట్ర బస్సులపై రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. ఇక రెండు రాష్ట్రాల అధికారులు  పాత కథే వినిపించారు. ఎవరి వాదన నుంచి వారు వెనక్కి తగ్గకపోవడంతో ప్రతిష్టంభన అలానే ఉండిపోయింది. పండగల సీజన్‌లో ప్రత్యేక బస్సులను నడుపుకొందామన్న ఆలోచనకూ ఇరువర్గాలు ఒప్పుకోలేదు. కిలోమీటర్ల అంశం తేలితేనే.. ఏ బస్సులనైనా ప్రారంభించుకుందామంటూ తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. ఏపీ అధికారులు కిలోమీటర్లు తగ్గించుకోవాలంటూ తెలంగాణ అధికారులు, తగ్గించుకోబోమంటూ ఏపీ అధికారులు వాదించడంతో మూడున్నర గంటల పాటు చర్చలు సాగినా.. ఎలాంటి ఫలితమివ్వలేదు.