ఏపీలో మరో జగన్ మార్క్ డెసిషన్

ఏపీలో ఇక ఇసుక డోర్ డెలివరీ కానుంది. ఇందుకోసం జనవరి రెండవతేదీని ముహూర్తంగా ఖరారు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జనవరి రెండో తేదీన కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఇసుక డోర్ డెలివరీ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీచేశారు దాంతో అందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రారంభించేశారు అధికారులు. సోమవారం ముఖ్యమంత్రి తన క్యాంప్ ఆఫీసులో ఏపీ ఇసుక పాలసీపై సమీక్ష నిర్వహించారు. గత ఆరు నెలల కాలంలో ఏపీవ్యాప్తంగా […]

ఏపీలో మరో జగన్ మార్క్ డెసిషన్

ఏపీలో ఇక ఇసుక డోర్ డెలివరీ కానుంది. ఇందుకోసం జనవరి రెండవతేదీని ముహూర్తంగా ఖరారు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జనవరి రెండో తేదీన కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఇసుక డోర్ డెలివరీ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీచేశారు దాంతో అందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రారంభించేశారు అధికారులు.

సోమవారం ముఖ్యమంత్రి తన క్యాంప్ ఆఫీసులో ఏపీ ఇసుక పాలసీపై సమీక్ష నిర్వహించారు. గత ఆరు నెలల కాలంలో ఏపీవ్యాప్తంగా నెలకొన్న ఇసుక కొరత వివరాలు తెలుసుకున్నారు. ఇసుక కొరతకు కారణాలను సమీక్షించారు. ఇప్పటికే ఇసుక రీచ్‌లను గుర్తించినందున ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఇసుక డోర్ డెలివరీని ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

ఇందులో భాగంగా జనవరి రెండో తేదీన కృష్ణా జిల్లాలో డోర్ డెలివరీ పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జనవరి ఏడో తేదీన తూర్పుగోదావరి జిల్లాల్లోను ఇసుక డోర్ డెలివరీని ప్రారంభించాలని జగన్ ఆదేశించారు. అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసి… రాష్ట్రవ్యాప్తంగా జనవరి 20వ తేదీ నుంచి ఇసుక డోర్ డెలివరీ చేయాలని నిర్దేశించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu