ముంబై వాసులకు పోలీసుల విన్నపం.. 2 కి.మీ. దాటి వెళ్లకండి..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ముంబయివాసులు తమ ఇంటికి రెండు కిలోమీటర్ల పరిధిని దాటి వెళ్లొద్దని ముంబయి పోలీసులు సూచించారు.

ముంబై వాసులకు పోలీసుల విన్నపం.. 2 కి.మీ. దాటి వెళ్లకండి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 29, 2020 | 5:24 AM

Don’t Go Beyond Two Km From Home: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ముంబయివాసులు తమ ఇంటికి రెండు కిలోమీటర్ల పరిధిని దాటి వెళ్లొద్దని ముంబయి పోలీసులు సూచించారు. దేశ ఆర్థిక రాజధానిలో రోజు రోజుకీ కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ఆదివారం ఈ మేరకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యాలయాలకు వెళ్లేవారు, అత్యవసర సేవల సిబ్బంది మాత్రమే రెండు కిలోమీటర్లు దాటి ప్రయాణించేందుకు అనుమతులు ఉంటాయని తెలిపారు.

కరోనా కట్టడికోసం ముంబై ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇక మీదట ప్రజలు తమ ఇంటికి రెండు కిలోమీటర్ల పరిధిలోని మార్కెట్లు, సెలూన్‌ షాపులకు మాత్రమే వెళ్లాలి. అంతకు మించిన దూరానికి ప్రమాణించడం పూర్తిగా నిషిద్ధం. వ్యాయామం, వాకింగ్ వంటివి కూడా రెండు కిలోమీటర్ల పరిధిలోకే పరిమితం. ఉద్యోగులు, ఇతర అత్యవసర సేవల సిబ్బందిని మాత్రం అనుమతిస్తాం. నగర ప్రజలకు ఇది మా విన్నపం. బయటకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి భౌతిక దూరం పాటించాలి” అని ఒక ప్రకటనలో తెలిపారు.