కరోనా ఎఫెక్ట్: మాస్కులు లేకపోతే ఇక క్రిమినల్ కేసులే..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో మాస్కులు, శానిటైజర్లు లేకుండా ప్రజలు రోడ్లపైకి రావొద్దని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. అయితే కొందరు ఈ నిబంధనలు

కరోనా ఎఫెక్ట్: మాస్కులు లేకపోతే ఇక క్రిమినల్ కేసులే..
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2020 | 4:41 AM

Bengaluru top cop urges public: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో మాస్కులు, శానిటైజర్లు లేకుండా ప్రజలు రోడ్లపైకి రావొద్దని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. అయితే కొందరు ఈ నిబంధనలు పాటించడంలేదు. వీరి వల్ల వారికే కాకుండా, ఇతరులకూ ప్రమాదమేనని చెప్పినా వినడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కర్ణాటక రాజధాని బెంగళూరులో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా కట్టడికోసం బెంగళూరులో ఎవరైనా మాస్కులు లేకుండా బయటకు వస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో ఉన్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘డీసీపీలు, బీబీఎంపీ అధికారులు రోడ్లపై నిలబడి సామాజిక దూరం, మాస్కులు వంటి నిబంధనలు అమలయ్యేలా చూస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి ప్రస్తుతానికి హెచ్చరికలే చేస్తున్నారు. ఆ తర్వాత క్రిమినల్ కేసులు పెడతాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

Also Read: కరోనా కేర్ సెంటర్‌గా.. కోరమంగళ ఇండోర్ స్టేడియం..