AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాల్టి నుంచి చేప ప్రసాదం పంపిణీ.. సర్వం సిద్ధం

ఇవాళ సాయంత్రం మొదలయ్యే చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ నాంపల్లిలో అంతా సిద్ధం చేశారు. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్థులకు బత్తిని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ, రేపు పంపిణీ చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై ఆదివారం సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగనుంది. చేప ప్రసాదం పంపిణీ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. లక్షా 60 వేల కొర్రమీన్లను అందుబాటులో ఉంచారు. మహిళలు, వికలాంగులు, వృద్ధులు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లు […]

ఇవాల్టి నుంచి చేప ప్రసాదం పంపిణీ.. సర్వం సిద్ధం
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 08, 2019 | 10:21 AM

Share

ఇవాళ సాయంత్రం మొదలయ్యే చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ నాంపల్లిలో అంతా సిద్ధం చేశారు. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్థులకు బత్తిని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ, రేపు పంపిణీ చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై ఆదివారం సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగనుంది.

చేప ప్రసాదం పంపిణీ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. లక్షా 60 వేల కొర్రమీన్లను అందుబాటులో ఉంచారు. మహిళలు, వికలాంగులు, వృద్ధులు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు చేప ప్రసాదం తీసుకునేందుకు ప్రజలు నాంపల్లి గ్రౌండ్‌కు చేరుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

శాఖల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూం, 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రద్దీని తెలుసుకునేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అందుబాటులో 6 వైద్య బృందాలు, 3 అగ్ని మాపక వాహనాలను, 3 బెల్లెట్ వాహనాలు, ఫైర్ కంట్రోల్ రూంలను అందుబాటులో ఉంచారు.

ఈ ఏడాది హైదరాబాద్‌లోని  14 ట్రాఫిక్ హబ్‌ల నుంచి 150 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ నుంచి వంద మొబైల్ టాయిలెట్లు, పారిశుద్ద్య నిర్వహణకు వెయ్యిమందికి పైగా సిబ్బందిని కేటాయించారు. రోగులు, సహాయకుల కోసం ఐదు రూపాయల భోజన కౌంటర్లు ఏర్పాటు చేశారు.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..