Disha APP: ‘దిశ యాప్’ సెన్సేషన్.. మహిళలూ డౌన్‌లోడ్ చేసుకోండి

Disha APP: ఇంటర్నెట్‌ ఉన్నా లేకున్నా దిశ ఎస్‌వోఎస్‌ యాప్‌ పని చేస్తుంది. ఫోన్‌లో యాప్‌ని తెరిచి ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే… ఆ ఫోన్‌ లొకేషన్‌ వివరాలు పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు వెళ్తాయి. ఏపీ ప్రభుత్వం.. ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ ఎస్‌వోఎస్‌ యాప్‌ వినియోగదారుల ప్రశంసలు పొందుతోంది. గత నాలుగు రోజుల్లోనే దిశ యాప్‌ను ఏకంగా 50 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ దీపిక పాటిల్‌ గురువారం […]

Disha APP: ‘దిశ యాప్’ సెన్సేషన్.. మహిళలూ డౌన్‌లోడ్ చేసుకోండి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 14, 2020 | 5:01 PM

Disha APP: ఇంటర్నెట్‌ ఉన్నా లేకున్నా దిశ ఎస్‌వోఎస్‌ యాప్‌ పని చేస్తుంది. ఫోన్‌లో యాప్‌ని తెరిచి ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే… ఆ ఫోన్‌ లొకేషన్‌ వివరాలు పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు వెళ్తాయి. ఏపీ ప్రభుత్వం.. ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ ఎస్‌వోఎస్‌ యాప్‌ వినియోగదారుల ప్రశంసలు పొందుతోంది.

గత నాలుగు రోజుల్లోనే దిశ యాప్‌ను ఏకంగా 50 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ దీపిక పాటిల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు స్పందిస్తున్న తీరుకు మెచ్చి గూగుల్‌ ప్లేస్టోర్‌లో 5కి ఏకంగా 4.9 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారన్నారు. 9వ తేదీ నుంచి సగటున రోజుకు రెండు వేల మందికిపైగా దిశ యాప్‌ ద్వారా పోలీస్‌ కమాండ్‌ రూమ్‌కు టెస్ట్‌ కాల్స్‌ చేస్తున్నారని వివరించారు.

ఆపదలో ఉన్నప్పుడు ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే చాలు పోలీసులు క్షణాల్లో వాలిపోతారు. ఈ యాప్‌తో దగ్గర్లోని ఆసుపత్రులు, బ్లడ్‌బ్యాంక్‌ వివరాలు తెలుసుకోవచ్చు. దిశ చట్టాన్ని తెచ్చిన 24 గంటల్లోనే మొదటి కేసులో పోలీసులు వాయు వేగంతో స్పందించిన విధానం, బాధితురాలికి పూర్తి స్థాయిలో భరోసా కల్పించిన తీరుతో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తున్నాయి.

సమీపంలోని పోలీస్‌స్టేషన్‌, సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు మార్గసూచిగా దిశ యాప్ ను వినియోగించవచ్చు. కుటుంబ సమస్యల కారణంతో ఎక్కువ మంది దిశను ఆశ్రయిస్తున్నారని, అలాంటి వారికి నిపుణులైన, అనుభవము ఉన్నవారి చేత కౌన్సెలింగ్‌ నిర్వహించి వారు కలసి మెలసి ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.