Varun Tej: ఆ దర్శకుడికి వరుణ్ రెండో ఛాన్స్..?

Varun Tej: విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో నటించే సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఇందులో వరుణ్, బాక్సర్‌గా కనిపించనుండగా.. ఈ మూవీ వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తరువాత వరుణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చినా.. తాజా […]

Varun Tej: ఆ దర్శకుడికి వరుణ్ రెండో ఛాన్స్..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 14, 2020 | 4:48 PM

Varun Tej: విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో నటించే సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఇందులో వరుణ్, బాక్సర్‌గా కనిపించనుండగా.. ఈ మూవీ వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తరువాత వరుణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చినా.. తాజా సమాచారం ప్రకారం శ్రీకాంత్ అడ్డాలకు ఈ హీరో రెండో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా వరుణ్‌ తేజ్‌ను టాలీవుడ్‌కు శ్రీకాంత్ అడ్డాలనే పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ముకుంద మూవీతోనే వరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం వెంకటేష్‌తో శ్రీకాంత్ అడ్డాల అసురన్ రీమేక్‌ నారప్పను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తరువాత గ్యాప్ తీసుకోకూడదని ఆయన అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఇప్పటికే వరుణ్‌కు కథ చెప్పడం.. దానికి అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.