AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disha App Second Case: కీచక ఆటోడ్రైవర్‌ను పట్టించిన దిశ యాప్.. మహిళ సేఫ్..

Disha App Second Case: మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్‌తో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఈ యాప్ ఆపదలో ఉన్న అమ్మాయిలు, మహిళలకు అండగా ఉంటూ వారిని సురక్షితంగా ఇళ్లకు చేరుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దిశ యాప్ ఓ కీచక ఆటోడ్రైవర్ నుంచి ఓ మహిళను రక్షించి అతడ్ని 8 నిమిషాల్లో పోలీసులకు పట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా కొల్లేటికోటలో ఓ మహిళ పక్క ఊరిలో పని నిమిత్తం ఆటోలో […]

Disha App Second Case: కీచక ఆటోడ్రైవర్‌ను పట్టించిన దిశ యాప్.. మహిళ సేఫ్..
Ravi Kiran
|

Updated on: Mar 05, 2020 | 2:37 PM

Share

Disha App Second Case: మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్‌తో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఈ యాప్ ఆపదలో ఉన్న అమ్మాయిలు, మహిళలకు అండగా ఉంటూ వారిని సురక్షితంగా ఇళ్లకు చేరుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దిశ యాప్ ఓ కీచక ఆటోడ్రైవర్ నుంచి ఓ మహిళను రక్షించి అతడ్ని 8 నిమిషాల్లో పోలీసులకు పట్టించింది. వివరాల్లోకి వెళ్తే..

కృష్ణాజిల్లా కొల్లేటికోటలో ఓ మహిళ పక్క ఊరిలో పని నిమిత్తం ఆటోలో బయలుదేరింది. కొద్దిసేపు అంతా బాగానే ఉన్నా.. ఆ మహిళకు ఆటోడ్రైవర్ ప్రవర్తనపై అనుమానం రావడం మొదలైంది. అంతేకాకుండా అతడు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను ఇవ్వబోయాడు. దీనితో ఆ మహిళ వెంటనే దిశ యాప్ ఎస్‌ఓ‌ఎస్ ద్వారా పోలీసులకు సమాచారం పంపించింది. 8 నిమిషాల్లో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని ఆ కీచక ఆటోడ్రైవర్ నుంచి మహిళను కాపాడారు. కాగా, ఆటోడ్రైవర్ పెద్దిరాజుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే దిశ యాప్ ఇంటర్నెట్ లేకపోయినా కూడా పని చేస్తుందన్న విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై ఈ యాప్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఆ యాప్‌లోని ఎస్‌ఓఎస్‌ (SOS) బటన్‌ నొక్కితే చాలు ఫోన్ లొకేషన్ వివరాలతో పాటుగా.. నెంబర్ ఎవరి పేరు మీద ఉంది.? వారి డీటెయిల్స్ ఏంటన్న విషయాలన్నీ కూడా పోలీస్ కంట్రోల్‌ రూంకి వెళ్లిపోతాయి. అటు మొబైల్ లొకేషన్‌కు సంబంధించిన 10 సెకన్ల వీడియో, ఆడియో కూడా పోలీసులకు చేరుతుంది.

For More News:

బిగ్‌బాస్ 3 విజేతపై బీరు సీసాలతో దాడి.. తలకు తీవ్ర గాయాలు..

కరోనా అలెర్ట్: ఇంటర్ విద్యార్థులకు కీలక సూచనలు.. మాస్కులతో పరీక్షలు..

భార్యకు కరోనా సోకిందని బాత్‌రూమ్‌లో లాక్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.?

నాలుగు రోజుల్లో అల్లకల్లోలం.. కరోనాను జయించిన కేరళ విద్యార్థిని మనోగతం..

కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు.?

టీ20 ప్రపంచకప్: తొలిసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా

ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా పేషెంట్.. డాక్టర్లు పరేషాన్!

కేఎఫ్‌సీ చికెన్ కోసం కరోనా బాధితుల డిమాండ్..?