IPL 2020: కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు.?

IPL 2020: ఐపీఎల్.. ఈ పొట్టి క్రికెట్‌కు ప్రపంచంలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇతర దేశాల్లో జరుగుతున్న లీగ్స్‌కు లేనంత బజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సొంతం. దానికి తగ్గట్టుగానే క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇది ఫీస్ట్ ఇస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ప్రతీ విభాగంలోనూ ఐపీఎల్ రేటింగ్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక మరికొద్ది రోజుల్లో మొదలుకానున్న ఐపీఎల్ 2020 సీజన్‌కు ఇప్పటికే కొన్ని జట్లు కసరత్తులు కూడా మొదలుపెట్టేశాయి. అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. […]

IPL 2020: కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు.?
Follow us

|

Updated on: Mar 05, 2020 | 2:38 PM

IPL 2020: ఐపీఎల్.. ఈ పొట్టి క్రికెట్‌కు ప్రపంచంలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇతర దేశాల్లో జరుగుతున్న లీగ్స్‌కు లేనంత బజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సొంతం. దానికి తగ్గట్టుగానే క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇది ఫీస్ట్ ఇస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ప్రతీ విభాగంలోనూ ఐపీఎల్ రేటింగ్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక మరికొద్ది రోజుల్లో మొదలుకానున్న ఐపీఎల్ 2020 సీజన్‌కు ఇప్పటికే కొన్ని జట్లు కసరత్తులు కూడా మొదలుపెట్టేశాయి. అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే తరుణంలో అసలు ఈ లీగ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. ఒకవేళ జరగకపోతే ఎన్ని కోట్లు నష్టం వస్తుందో చెప్పలేం. ఇక దీనంతటికి కారణం మహమ్మారి కరోనా వైరస్.

ప్రాణాంతక కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచదేశాలన్నీ కూడా వణికిపోతున్నాయి. ఇప్పుడు అది భారత్‌లో కూడా విజృంభిస్తోంది. ఇక కరోనా ప్రభావం ప్రస్తుతం క్రీడారంగంపై పడింది. తాజాగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు శ్రీలంక టూర్‌లో షేక్‌హ్యాండ్స్‌ను నిషేదించారు. అలాగే ఐపీఎల్ 2020 కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంపై ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పందించారు. కరోనా ఎఫెక్ట్ ఐపీఎల్‌పై లేదని.. షెడ్యూల్ ప్రకారమే మార్చి 29న మొదలవుతుందని స్పష్టం చేశారు. అటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. మార్చి 12 నుంచి జరగబోయే సఫారీల సిరీస్‌లో కూడా ఎలాంటి మార్పులు లేవని.. కానీ కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటిస్తామని గంగూలీ తెలియజేశారు. కాగా, ఇండియాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

For More News: 

బిగ్‌బాస్ 3 విజేతపై బీరు సీసాలతో దాడి.. తలకు తీవ్ర గాయాలు..

కరోనా అలెర్ట్: ఇంటర్ విద్యార్థులకు కీలక సూచనలు.. మాస్కులతో పరీక్షలు..

భార్యకు కరోనా సోకిందని బాత్‌రూమ్‌లో లాక్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.?

నాలుగు రోజుల్లో అల్లకల్లోలం.. కరోనాను జయించిన కేరళ విద్యార్థిని మనోగతం..

టీ20 ప్రపంచకప్: తొలిసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా

కీచక ఆటోడ్రైవర్‌ను పట్టించిన దిశ యాప్.. మహిళ సేఫ్..

ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా పేషెంట్.. డాక్టర్లు పరేషాన్!

కేఎఫ్‌సీ చికెన్ కోసం కరోనా బాధితుల డిమాండ్..?

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..