బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్

కర్ణాటక: కరడుగట్టిన ఉగ్రవాది, జేషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను విడిచిపెట్టింది మీరు కాదా? అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భాజపా మీద విరుచుకుపడ్డారు. బాలాకోట్ ఉగ్రస్థావరం మీద వైమానిక దాడులు జరిగాయని పాకిస్థాన్ ఒప్పుకున్నా, విపక్షాలు మాత్రం వాటిపై ఇంకా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం కర్ణాటకలోని హావేరిలో జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ […]

బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్
Follow us

|

Updated on: Mar 09, 2019 | 6:23 PM

కర్ణాటక: కరడుగట్టిన ఉగ్రవాది, జేషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను విడిచిపెట్టింది మీరు కాదా? అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భాజపా మీద విరుచుకుపడ్డారు. బాలాకోట్ ఉగ్రస్థావరం మీద వైమానిక దాడులు జరిగాయని పాకిస్థాన్ ఒప్పుకున్నా, విపక్షాలు మాత్రం వాటిపై ఇంకా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం కర్ణాటకలోని హావేరిలో జరిగిన సభలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..‘కొద్ది రోజుల క్రితం పుల్వామా ఘటనలో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది మరణించారు. దానిపై ప్రధానికి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. వారిని ఎవరు చంపారు? జైషే మహ్మద్ అధినేత పేరేంటి? మసూద్ అజార్‌ను వెనక్కి పంపించింది ఎవరు? మేము మీలా కాదు. ఉగ్రవాదం ముందు తలవంచం. అలాగే దేశానికి ఇంకో విషయం కూడా చెప్పాలని కోరుతున్నాను. మీరు చైనా అధ్యక్షుడితో కలిసి ఊయలలో కూర్చున్న సమయంలో చైనా ఆర్మీ డోక్లామ్ ప్రాంతంలోకి చొచ్చుకొని వచ్చింది. ఇప్పటికీ చైనా ఆర్మీ అక్కడే ఉందని ప్రపంచం మొత్తానికి తెలుసు. మీరు మాత్రం ఏ అజెండా లేకుండా చైనాకు వెళ్లారు’ అని ఈ ఐదేళ్ల కాలంలో భాజపా హయాంలో చోటుచేసుకున్న పరిమాణాలపైనా విమర్శలు చేశారు. అలాగే 2019లో తాము అధికారంలోకి రాగానే కనీస ఆదాయ హామీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. రైతులు దేశానికి వెన్నెముక వంటి వారని, తమ పార్టీ వారితోనే ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే జీఎస్టీలో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాదీ వింత ఆలోచన.. నామినేషన్ దాఖలకు ఎలా వెళ్లాడో చూడండి
హైదరాబాదీ వింత ఆలోచన.. నామినేషన్ దాఖలకు ఎలా వెళ్లాడో చూడండి
ఆ ఒక్కటి అడక్కు సినిమాకు ముందుగా అనుకున్నది అతడినే..
ఆ ఒక్కటి అడక్కు సినిమాకు ముందుగా అనుకున్నది అతడినే..
OTTలోకి వచ్చేసిన గోపీచంద్ యాక్షన్ సినిమా భీమా.!
OTTలోకి వచ్చేసిన గోపీచంద్ యాక్షన్ సినిమా భీమా.!
ఎండాకాలం కాసులు కురిపించే బిజినెస్.. పెట్టుబడి చాలా తక్కువ
ఎండాకాలం కాసులు కురిపించే బిజినెస్.. పెట్టుబడి చాలా తక్కువ
ఒక్క సినిమా రూ.120 కోట్ల రెమ్యునరేషన్ | ముద్దుల హీరోగా డార్లింగ్.
ఒక్క సినిమా రూ.120 కోట్ల రెమ్యునరేషన్ | ముద్దుల హీరోగా డార్లింగ్.
కళ్లద్దాల వల్ల ముక్కు ఇరువైపులా మచ్చలు ఏర్పడ్డాయా?
కళ్లద్దాల వల్ల ముక్కు ఇరువైపులా మచ్చలు ఏర్పడ్డాయా?
ఎప్పుడూ జరిగితే అనుభవం. ఎప్పుడో జరిగితే అద్భుతం.! పుష్ప ఎంజాయ్.
ఎప్పుడూ జరిగితే అనుభవం. ఎప్పుడో జరిగితే అద్భుతం.! పుష్ప ఎంజాయ్.
ఆ సినిమా తర్వాత సిగరెట్లకు బానిసైన హీరోయిన్..
ఆ సినిమా తర్వాత సిగరెట్లకు బానిసైన హీరోయిన్..
అదిరే లుక్స్‌, ఆకట్టుకునే ఫీచర్స్‌.. వివో నుంచి స్టన్నింగ్‌ ఫోన్‌
అదిరే లుక్స్‌, ఆకట్టుకునే ఫీచర్స్‌.. వివో నుంచి స్టన్నింగ్‌ ఫోన్‌
ఉదయాన్నే హ్యాంగోవర్‌తో ఆఫీస్‌కు వెళ్లలేకపోతున్నారా?
ఉదయాన్నే హ్యాంగోవర్‌తో ఆఫీస్‌కు వెళ్లలేకపోతున్నారా?