Vikramarkudu: ‘విక్రమార్కుడు’లో రవితేజ డూప్‌గా చేసింది ఆ టాలీవుడ్ హీరోనా? పాపం చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో..
మాస్ మహారాజా రవితేజ- దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'విక్రమార్కుడు'. 2006 లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రల్లో అద్భుతంగా నటించాడు.

మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులు ఎదుర్కొంటోన్న ఈ సీనియర్ హీరో ఎట్టకేలకు ఇరుముడి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 250 కోట్ల కలెక్షన్లు సాధిస్తోంది. కాగా రవితేజ సినిమా కెరీర్‌లో ఇరుముడి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే అందులో ‘విక్రమార్కుడు’ సినిమా చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. . సాధారణంగా దర్శక ధీరుడు రాజమౌళి సినిమాల్లో హీరోల స్టార్ డమ్ కంటే.. కంటే జక్కన్న డైరెక్షన్, మేకింగ్ తదితర విషయాలే ఎక్కువగా హైలేట్ అవుతుంటాయి. కానీ విక్రమార్కుడు సినిమాలో మాత్రం రవితేజ జక్కన్న డైరెక్షన్ నే డామినేట్ చేశాడంటారు సినిమా నిపుణులు. అంతలా ఈ సినిమాలో ఒదిగిపోయారు మాస్ మహారాజా. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రల్లో నటించాడు. అత్తిలి సత్తిబాబుగా ఒక పాత్రలో కామెడీ పండిస్తే మరో పాత్రలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ విక్రమ్ సింగ్ రాథోడ్ గా తనదైన రౌద్రాన్ని చూపించారు రవితేజ. ఇక విక్రమార్కుడు సినిమా తర్వాత రవితేజ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మాస్ హీరోగా అభిమానులకు మరింత చేరువయ్యాడు. ఇదిలా ఉంటే ఈ బ్లాక్ బస్టర్ విక్రమార్కుడు సినిమా గురించి చాలా మందికి తెలియన విషయం ఒకటుంది.. అదేంటంటే..
విక్రమార్కుడు సినిమాలో రవితేజకు డూప్ గా ఆయన తమ్ముడు ప్రముఖ నటుడు భరత్ రాజ్ నటించడం విశేషం. చూడ్డానికి రవితేజ లాంగే ఉండే భరత్ నటించడం వల్లనే విక్రమార్కుడు సినిమా షూటింగ్ చాలా ఈజీగానూ, త్వరగానూ అయిపోయిందట. కాగా భరత్ కూడా పలు సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా, విలన్ గానూ మెప్పించాడు. అతడే ఒక సైన్యం, ఒక్కడే, డేంజర్, వీరభద్ర, ఢీ, మంగతాయారు టిఫిన్ సెంటర్, రెడీ, ఏక్ నిరంజన్, కళావర్ కింగ్, రామ రామ కృష్ణ కృష్ణ, బావ, దూకుడు, బాడీ గార్డ్, రామయ్యా వస్తావయ్యా, జంప్ జిలానీ, దోచేయ్, షేర్, ఆ ముగ్గురు, మిస్టర్ ఇలా ఎన్నో సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ తో ఆకట్టుకున్నాడు భరత్. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే తరచూ వివాదాల్లోనూ భరత్ పేరు వినిపించింది. ముఖ్యంగా టాలీవుడ్ లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో భరత్ పేరు బాగా వినిపించింది.
కాగా నటుడిగా బిజీగా ఉండగానే ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు భరత్. 2017 జూన్ 24న రాత్రి హైదరాబాద్‌లోని శంషాబాద్ మండలం కోత్వాల్ గూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భరత్ కన్నుమూశారు. కాగా చనిపోయేనాటికి భరత్ వయసు కేవలం 46 ఏళ్లు మాత్రమే.

Ravi Teja Brother Bharath
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




