UPI Payments: యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే కోర్టు కేసులే.. జీవితాంతం ఇబ్బంది పడతారు జాగ్రత్త..
యూపీఐ ద్వారా డబ్బులు పంపుతున్నారా.. లేదా వేరేవారి నుంచి స్వీకరిస్తున్నారా.. అయితే డబ్బులు ఎందుకు పంపుతున్నారు.. లేదా ఎందుకు స్వీకరించారనే కారణం తప్పనిసరిగా పొందుపర్చాలి. దీని వల్ల భవిష్యత్తులో మీరు కోర్టు కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉండదు. లావాదేవీలకు సంబంధించి ఎలాంటి వివాదాలు చోటుచేసుకున్నా మీకు అది ఉపయోగపడుతుంది.

ఇటీవల యూపీఐ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోజూ రికార్డ్ స్థాయిలో యూపీఐ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. నగరాల నుంచి గ్రామాల వరకు ప్రతీచోట యూపీఐ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. రోడ్డు పక్కన ఉండే చిన్న టీ షాప్ దగ్గన నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు ప్రతీ చోట యూపీఐ లావాదేవీలను చేసే సౌకర్యం అందుబాటులో వచ్చింది. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సెకన్లలోనే నిధులు బదిలీ చేయవచ్చు. దీంతో పాటు ఇటీవల యూపీఐ మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. నకిలీ క్యూఆర్ కోడ్ సృష్టించడం, నకిలీ యాప్‌ల ద్వారా డబ్బులు పంపించినట్లు చూపించడం లాంటి నేరాలు జరుగుతున్నాయి.
ఈ ఒక్క తప్పు చేయకండి
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ ద్వారా డబ్బులు పంపించేటప్పుడు లేదా స్వీకరించినప్పుడు తప్పనిసరిగా ఈ నగదు ఎందుకు పంపించామనే కారణం పొందుపర్చాలని నిపుణులు చెబుతున్నారు. మీరు యూపీఐ యాప్స్‌లో డబ్బులు పంపించేటప్పుడు కింద కామెంట్ బాక్స్ ఉంటుంది. ఆ కామెంట్ బాక్స్‌లో డబ్బులు ఎందుకు పంపుతున్నారనేది మెన్షన్ చేయాలి. ఇక ఎవరినుంచైనా మీరు డబ్బులు స్వీకరించినప్పుడు వారు రీజన్ మెన్షన్ చేయకపోతే మీరు కారణం టైప్ చేయాలి. దీని వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు డబ్బులు పంపినా పంపించలేదనే కొంతమంది అంటుంటారు. అలాంటప్పుడు మీరు సులువుగా తెలుసుకునే అవకాశముంటుంది. మీరు కారణం మెన్షన్ చేయకపోతే భవిష్యత్తులో మీరు చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంటుందని హెచ్చరిస్తున్నారు. మీరు డబ్బులు ఇచ్చినా.. ఇవ్వలేదని మీపై రికవరీ సూట్ కేసులు వేయవచ్చు. ఇలాంటప్పుడు మీరు చిక్కుల్లో పడతారు. డబ్బు పంపేటప్పుడు క్లియర్‌గా దేని కోసం సెండ్ చేస్తున్నారనేది కామెంట్ బాక్సులో తెలపడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు.
భవిష్యత్తులో పెరగనున్న కేసులు
ఇటీవల ఎక్కువగా యూపీఐ ట్రాన్సాక్షన్లు జరుగుతున్న క్రమంలో ఈ లావాదేవీలకు సంబంధించి కోర్టు కేసులు కూడా ఎక్కువగా నడుస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో లావాదేవీలకు సంబంధించి మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కారణం తెలపడం అనేది చాలా ముఖ్యం. దీని వల్ల మీరు డబ్బులు ఎందుకు పంపారనేది స్పష్టంగా తెలుస్తోంది. భవిష్యత్తులో మీరు చూసుకున్నా కూడా మీ దగ్గర రికార్డు ఉంటుంది. చాలామంది కింద ఉండే కామెంట్ బాక్స్ గురించి పట్టించుకోరు. దానిన లైట్ తీసుకుంటారు. మీరు చేసే చిన్న తప్పు వల్ల భవిష్యత్తులో పెద్ద ప్రమాదంలో పడే అవకాశముంటుంది.
