AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ ఇంత దారుణమా?.. సొంత తమ్ముడినే అతి కిరాతకంగా హత్య చేయించిన అన్న.. ఎందుకంటే?

ఆస్తి కోసం అన్న అన్నంత పని చేశాడు. బంధాలను బలి చేస్తూ సొంత తమ్ముడిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మృతదేహాన్ని కూడా దొరకకుండా తగలబెట్టాడు‌. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు గుట్టు రట్టైంది. మిస్సింగ్ మిస్టరీ కాస్త క్రైం కథా చిత్రంగా మారి ఒళ్లు జలదరించే నిజాల నిగ్గు తేలింది. సొంత తమ్ముడినే నమ్మించి.. కిరాయి హంతకులతో హత్య చేయించి.. ఆనవాళ్లు లేకుండా మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో తగలబెట్టిన ఘటన మంచిర్యాల జిల్లాలో సంచలనం రేపింది.

మరీ ఇంత దారుణమా?.. సొంత తమ్ముడినే అతి కిరాతకంగా హత్య చేయించిన అన్న.. ఎందుకంటే?
Mancherial Crime News
Naresh Gollana
| Edited By: |

Updated on: Sep 28, 2026 | 9:21 PM

Share

ఆస్తికోసం సొంత తమ్ముడినే కిరాయి హంతకులతో హత్య చేయించిన దారుణ ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే… వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కుడుకల శ్రీనివాస్‌ (40) ఈ నెల 20న స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పి మంచిర్యాలకు బయలుదేరాడు. అలా వెళ్లిన శ్రీనివాస్‌ రెండు రోజులైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో, కుటుంబ సభ్యులు నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. శ్రీనివాస్ మిస్సయిన రోజు రాత్రి 8 గంటల సమయంలో చెన్నూర్‌ పట్టణంలోని కొత్త బస్టాండ్‌ సమీపంలో ఉన్న శ్రీలక్ష్మి వెంకటేశ్వర వైన్స్‌లో తన దూరపు బంధువు గోదరి సమ్మయ్యతో కలిసి మద్యం సేవించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆధారాలు రాబట్టారు. సమ్మయ్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది.

భూములు, ఇళ్ల స్థలాల విషయంలో కుడుకల శ్రీనివాస్, కుడుకల రాజేష్ అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. దీంతో తమ్ముడు శ్రీనివాస్‌ను అడ్డుతొలగించుకోవాలని భావించిన అతడి అన్న రాజేష్‌.. పక్కా ప్లాన్‌తో హత్యకు తెరతీసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు దర్యాప్తులో వెల్లడైంది. తమ్ముడిని హత్య చేయించేందుకు ఏకంగా రూ.2 లక్షల సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు.

శ్రీనివాస్‌ను హతమార్చేందుకు రాజేష్‌ తన బామ్మర్ది గోదరి సమ్మయ్య, మరో వ్యక్తి కిష్టస్వామిని రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం రూ.2 లక్షలకు సుపారీ మాట్లాడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 20న శ్రీనివాస్‌ చెన్నూర్‌ వస్తున్న విషయం తెలుసుకున్న నిందితులు.. అతడిని నమ్మించి తమ వెంట తీసుకెళ్లేందుకు పథకం రచించారు.

గుప్తనిధుల పేరుతో ఎర..

ముందుగా శ్రీనివాస్‌తో కలిసి సమ్మయ్య మద్యం సేవించాడు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో గుప్తనిధులు ఉన్నాయని.. అక్కడ తవ్వకాలు చేస్తే బంగారం దొరికే అవకాశం ఉందని నమ్మించాడు. అలా శ్రీనివాస్‌ను చెన్నూర్ మండలం సోమనపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. జన సంచారం లేని ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత అసలు ప్లాన్ అమలు చేశాడు.

గొడ్డలితో విచక్షణారహితంగా దాడి..

కొంత దూరం వెళ్లిన అనంతరం సమ్మయ్య తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో శ్రీనివాస్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. మెడ, చేతులు, కాళ్లపై విచక్షణారహితంగా గొడ్డలితో నరికాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు శ్రీనివాస్‌ ప్రయత్నించినప్పటికీ.. దాడి ఆగలేదు. చివరకు తీవ్ర గాయాలతో శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతదేహాన్ని కూడా వదల్లేదు..

హత్యతో కథ ముగియలేదు. శ్రీనివాస్‌ మృతదేహాన్ని అక్కడే వదిలేస్తే ఆధారాలు దొరికే అవకాశం ఉందని భావించిన నిందితులు.. పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని దహనం చేసి.. తమ నేరానికి ఎలాంటి ఆనవాళ్లు మిగలకుండా చేయాలని ప్రయత్నించినట్లు ఏసీపీ వెల్లడించారు. హత్య అనంతరం ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

మిస్సింగ్ కేసుతో మొదలైన దర్యాప్తు..

ఈ నెల 21న శ్రీనివాస్‌ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాస్‌ చివరిసారిగా ఎక్కడికి వెళ్లాడు? ఎవరిని కలిశాడు? అతడి ఫోన్‌ ఎక్కడ ఆగిపోయింది? అనే కోణాల్లో దర్యాప్తు సాగించారు. అనుమానితులపై నిఘా పెట్టిన పోలీసులు.. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను సేకరించారు.

సమ్మయ్య విచారణతో బయటపడిన అసలు కథ..

దర్యాప్తులో భాగంగా సమ్మయ్యను పోలీసులు విచారించగా.. పొంతనలేని సమాధానాలు రావడంతో మరింత లోతుగా విచారణ చేపట్టారు. టెక్నికల్‌ ఆధారాలు, ఇతర వివరాలను జోడించి ప్రశ్నించడంతో చివరకు అసలు విషయం బయటపడినట్లు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్‌ను సోమనపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు సమ్మయ్య అంగీకరించినట్లు ఏసీపీ చెప్పారు. దీంతో పోలీసులు మిగతా నిందితులను కూడా అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల చేతికి కీలక ఆధారాలు.. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, రెండు మోటార్‌ సైకిళ్లు, సెల్‌ఫోన్‌, రూ.60 వేల నగదు, రక్తపు మరకలు ఉన్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఆస్తి వివాదం చివరకు ప్రాణం తీసేంత దూరం వెళ్లింది. నమ్మిన అన్నే.. నమ్మించి అడవిలోకి పంపాడు. సుపారీ ఇచ్చి హంతకులను రంగంలోకి దించాడు. గుప్తనిధుల పేరుతో తమ్ముడిని వలలో వేసి.. గొడ్డలితో నరికి చంపించాడు. ఆ తర్వాత ఆనవాళ్లు లేకుండా మృతదేహాన్ని తగలబెట్టించాడు. కానీ నేరం ఎంత పక్కాగా ప్లాన్ చేసినా.. టెక్నాలజీ ఆధారాలు, పోలీసుల దర్యాప్తు ముందు ఆనవాళ్లను దాచలేకపోయారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఏసీపీ వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సొంత తమ్ముడినే అతి కిరాతకంగా హత్య చేయించిన అన్న.. ఎందుకంటే?
సొంత తమ్ముడినే అతి కిరాతకంగా హత్య చేయించిన అన్న.. ఎందుకంటే?
గ్రాండ్ గా వస్తున్న కార్తిక్ జయంతి రాయవలస..
గ్రాండ్ గా వస్తున్న కార్తిక్ జయంతి రాయవలస..
రుచికరమైన పట్టా గోబీ లచ్చాపరాఠా ఎప్పుడైనా తిన్నారా? భలే ఉంటుందిలే
రుచికరమైన పట్టా గోబీ లచ్చాపరాఠా ఎప్పుడైనా తిన్నారా? భలే ఉంటుందిలే
నాని ' ది ప్యారడైజ్' సినిమాలో ఆ స్టార్ నటుడి సీన్లు కట్ చేశారా?
నాని ' ది ప్యారడైజ్' సినిమాలో ఆ స్టార్ నటుడి సీన్లు కట్ చేశారా?
భారత్, చైనాలో మనీప్లాంట్ కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
భారత్, చైనాలో మనీప్లాంట్ కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన విత్యా రామ్‌రాజ్
ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన విత్యా రామ్‌రాజ్
ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. ఒకే క్లిక్‌తో పీఎఫ్ సేవలు..
ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. ఒకే క్లిక్‌తో పీఎఫ్ సేవలు..
కళ్లముందే పేకమేడలా కూలిపోయిన కొండ.. నేపాల్‌లో జల ప్రళయం..
కళ్లముందే పేకమేడలా కూలిపోయిన కొండ.. నేపాల్‌లో జల ప్రళయం..
40 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ.. వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే
40 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ.. వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే