Rajinikanth: మరో యంగ్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్.. ఆ దర్శకుడు ఎవరంటే
దాంతో రజినీకాంత్ నెక్స్ట్ సినిమ కోసం ఆయన అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ తన నెక్స్ట్ మూవీ నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తోన్న విషయం తెలిసిందే.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికి అదే ఎనర్జీ.. అదే స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. స్మాల్ గ్యాప్ తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు సూపర్ స్టార్. ఈ మధ్య కాలంలో రజినీకాంత్ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా వచ్చిన పెద్దన్న సినిమాకూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. దాంతో రజినీకాంత్ నెక్స్ట్ సినిమ కోసం ఆయన అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ తన నెక్స్ట్ మూవీ నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తోన్న విషయం తెలిసిందే. నెల్సన్ రీసెంట్ గా దళపతి విజయ్ తో బీస్ట్ మూవీని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు నెల్సన్. ఈ క్రమంలోనే ఓ పవర్ ఫుల్ కథతో సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు జైలర్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.
ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. టైటిల్ పోస్టర్ తప్ప ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు ఈ సినిమా నుంచి. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సూపర్ స్టార్. రజిని మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. సిబి చక్రవర్తికి అవకాశం ఇచ్చిన రజినీకాంత్.
శివకార్తికేయన్ హీరోగా ‘డాన్’ అనే సినిమాను తెరకెక్కించారు సిబి చక్రవర్తి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రజినీకాంత్ కోసం ఓ ఇంట్రెస్టింగ్ కథను సిద్ధం చేస్తున్నాడట ఈ యంగ్ డైరెక్టర్. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్ రానుందని తెలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.