Dhanush on Twitter:’ఎక్కడ మొదలయ్యానో మళ్లీ అక్కడే..?’..ధనుష్ ఎమోషనల్ ట్వీట్ ఆయన గురించే
ఎక్కడ మొదలయ్యానో మళ్లీ అక్కడే..? ఇలా సోషల్ మీడియాలో ఎమోషనల్ కామెంట్ చేశారు ధనుష్. ఓ మూవీ ఎనౌన్స్‌మెంట్ చేస్తూ హార్ట్ టచింగ్ ట్వీట్ చేశారు.
ఎక్కడ మొదలయ్యానో మళ్లీ అక్కడే..? ఇలా సోషల్ మీడియాలో ఎమోషనల్ కామెంట్ చేశారు ధనుష్. ఓ మూవీ ఎనౌన్స్‌మెంట్ చేస్తూ హార్ట్ టచింగ్ ట్వీట్ చేశారు. అదేంటి..? ఎన్నో సినిమాలు.. అది కూడా హాలీవుడ్ రేంజ్‌కు వచ్చిన ధనుష్ ఓ తమిళ మూవీ చేస్తున్నందుకు ఇంత హ్యాపీ ఫీలవుతున్నారంటే.. ఆ మూవీకి ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుంది కదా..? అవును ఆ మూవీని తన బ్రదర్ సెల్వరాఘవన్ డైరెక్షన్‌లో చేస్తున్నారు ధనుష్. తన కెరీర్‌ను మలుపు తిప్పిన కాదల్ కొండేన్ కాంబినేషన్ మరో సారి రిపీట్ అవుతుండటంతో ఎమోషనల్ అయ్యారు ధనుష్.. తను ఈ స్థాయికి రావడానికి కారణమైన అన్నయ్యతో సినిమా చేయటం చాలా హ్యాపీ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అంతేకాదు… ఈ ట్వీట్‌లో ధనుష్ చేసిన ఓ కామెంట్ మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది.. ‘ఎట్ లీస్ట్… ఈ సారైనా… అన్నయ్యను ఇంప్రెస్ చేస్తానేమో’ అని ధనుష్ కామెంట్ చేయటం ఆసక్తికరంగా మారింది. నేషనల్ లెవల్‌లో బెస్ట్ యాక్టర్ అనిపించుకుని… హాలీవుడ్ రేంజ్‌కి చేరుకున్న ధనుష్.. ఇంకా సెల్వరాఘవన్‌ను మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయారన్నమాట.
Selvaraghavan + yuvan + aravind krishna.. well well … right where I started. Very happy to join my maker , my creator and the only reason I’m here today my brother @selvaraghavan again. I hope this time Atleast I impress him ??
— Dhanush (@dhanushkraja) December 23, 2020
Also Read :