వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రిస్టమస్ వేడుకలు, ఆరాధన మహోత్సవంలో భక్తులకు శాంతి సందేశాలు
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రిస్టమస్ వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. చర్చిలకు పోటెత్తిన క్రైస్తవ సోదరులు, యేసుక్రీస్తు..
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రిస్టమస్ వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. చర్చిలకు పోటెత్తిన క్రైస్తవ సోదరులు, యేసుక్రీస్తు నామాన్ని స్తుతిస్తూ భక్తి శ్రద్ధలతో క్రిస్టమస్ సంబరాలు జరుపుకున్నారు. హన్మకొండలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ లో క్రిస్టమస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు ఫాతిమా చర్చ్ లో క్రైస్తవులు వేల సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్దదైన (సిఎస్ఐ) చర్చి ఆఫ్ సౌత్ ఇండియా చర్చిలో క్రిస్టమస్ వేడుకలు వైభవంగా జరిగాయి. హైదరాబాద్ ఎసిటిసి( ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్) ప్రొఫెసర్ హెలెన్ సలోమి ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఆరాధన మహోత్సవంలో భక్తులకు శాంతి సందేశాన్ని అందించారు.