Strain Virus: స్ట్రెయిన్ వైరస్‌పై ఏపీ ముఖ్యమంత్రి సమీక్ష… అప్రమత్తంగా ఉండాలని సూచన…

కొత్తగా విస్తరిస్తున్న స్ట్రెయిన్ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

Strain Virus: స్ట్రెయిన్ వైరస్‌పై ఏపీ ముఖ్యమంత్రి సమీక్ష... అప్రమత్తంగా ఉండాలని సూచన...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 25, 2020 | 2:41 PM

కొత్తగా విస్తరిస్తున్న స్ట్రెయిన్ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. యూకే నుంచి వచ్చిన వారికి కచ్చితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చిన 1200 మంది ప్రయాణికులను గుర్తించినట్లు తెలిపారు. ఆయా వివరాలను జిల్లాల కలెక్టర్లకు పంపినట్లు అధికారులు తెలియజేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 21 వేల మంది బృందంతో బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల ట్రాకింగ్ ప్రక్రియ కొనసాగుతోందని ముఖ్యమంత్రికి తెలిపారు. అంతేకాకుండా యూకే నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరికి ఆర్టీ పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రికి చెందిన మహిళ బ్రిటన్ నుంచి రాగా.. ఆమెకు కరోనా పాజిటివ్ తేలినట్లు ప్రకటించారు. అంతే కాకుండా ఆమెతో రైలులో రాజమండ్రి నుంచి మచిలీపట్నం ప్రయాణించిన ప్రయాణికులకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని, హోం ఐసోలేషన్ కావాలని సూచించామని వివరించారు.