Bigg Boss 4 : సోహెల్‌ ఈ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తాడా..? బిగ్ బాస్ ఇమేజ్‌తో బిగ్‌ స్క్రీన్ మీద సత్తా చాటుతాడా..?

సింగరేణి ముద్దు బిడ్డ ఇస్మార్ట్ సోహెల్‌.. అన్నట్టుగానే సినిమా స్టార్ట్ చేశారు. బిగ్ బాస్‌ స్టేజ్ మీద ఓ మంచి సినిమా తీసి హిట్ కొడతా అంటూ ప్రామిస్‌ చేసిన సోహెల్.. ఫస్ట్ స్టెప్ వేశారు.

Bigg Boss 4 :  సోహెల్‌ ఈ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తాడా..? బిగ్ బాస్ ఇమేజ్‌తో బిగ్‌ స్క్రీన్ మీద సత్తా చాటుతాడా..?
Follow us

|

Updated on: Dec 25, 2020 | 2:58 PM

సింగరేణి ముద్దు బిడ్డ ఇస్మార్ట్ సోహెల్‌.. అన్నట్టుగానే సినిమా స్టార్ట్ చేశారు. బిగ్ బాస్‌ స్టేజ్ మీద ఓ మంచి సినిమా తీసి హిట్ కొడతా అంటూ ప్రామిస్‌ చేసిన సోహెల్.. ఫస్ట్ స్టెప్ వేశారు. జార్జ్‌ రెడ్డి మేకర్స్‌తో ఓ మూవీ ఎనౌన్స్‌ చేశారు సోహెల్‌. ఇప్పటి నుంచే అసలు కథ షురూ అంటూ తన సినిమా ఎనౌన్స్‌మెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

నిజంగానే ఇక్కడి నుంచి కథ వేరే ఉంటదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. బిగ్ బాస్‌ హీట్ ఇంకా కంటిన్యూ అవుతోంది. టీవీ షోస్‌, యూట్యూబ్‌ ఇంటర్వ్యూలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు కంటెస్టెంట్స్‌.. బట్ ఈ హీట్‌ ఇంకెన్నాళ్లు ఉంటుంది. మహా అయితే ఇంకో పది రోజులు.. ఆ తరువాత కూడా ఇదే టెంపో మెయిన్‌ టైన్ చేస్తారా..? అది సాధ్యమేనా? అంతేకాదు గెస్ట్ అపియరెన్స్‌ ఇస్తానన్న చిరుకి, ఫ్రీగా యాక్ట్‌ చేస్తానన్న బ్రహ్మానందానికి సరైన రోల్స్ ఇచ్చేంత సాలిడ్‌ సబ్జెట్‌ సోహెల్ దగ్గర ఉందా..? అన్నది ఇప్పుడు ప్రధానాంశం. .

బిగ్ బాస్‌ ఇమేజ్‌ కంటెస్టెంట్‌ల ఫిలిం కెరీర్‌కు పెద్దగా హెల్ప్ కాదన్నది ప్రీవియస్‌ ఎక్స్‌పీరియన్స్‌తో క్లియర్‌గా తెలుస్తోంది. ఈ షోతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నవారు, టైటిల్‌ విన్నర్ అయిన వాళ్లు కూడా తరువాత ఫేడవుట్‌ అయిపోయారు. మరి సోహెల్‌ ఈ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తారా..? బిగ్ బాస్ ఇమేజ్‌తో బిగ్‌ స్క్రీన్ మీద సత్తా చాటుతారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read : 

Tadipatri fight : తాడిపత్రిలో హై అలర్ట్..అన్ని సెంటర్లలోనూ పికెటింగ్..నేడు కేసులు నమోదు చేసే ఛాన్స్

Variety marriage : వధువు పెళ్లి వద్దని వెళ్లిపోయింది…అతిథిలా వచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది

Drunk And Drive Tests : మందుబాబులకు హెచ్చరిక..నేటి నుంచి నగరంలో డ్రంక్ అండ్ టెస్టులు షురూ