ఏపీలో విద్యార్థుల కోసం ప్రత్యేక వెబ్​సైట్.. ఆశయాల వైపు పయనించేలా వినూత్న ఆలోచన

 ఏపీలో విద్య, వైద్యంపై సీఎం జగన్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పలు విప్లవాత్మకమైన కార్యక్రమాలు పథకాలు ప్రవేశపెట్టింది.

ఏపీలో విద్యార్థుల కోసం ప్రత్యేక వెబ్​సైట్.. ఆశయాల వైపు పయనించేలా వినూత్న ఆలోచన
Follow us

|

Updated on: Nov 14, 2020 | 6:10 PM

ఏపీలో విద్య, వైద్యంపై సీఎం జగన్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పలు విప్లవాత్మకమైన కార్యక్రమాలు పథకాలు ప్రవేశపెట్టింది. భవిష్యత్‌లో పిల్లలు మంచి విజయాలు సాధించాలంటే చదువు చాలా కీలకమని పదే, పదే చెబుతున్నారు సీఎం జగన్. ఈ క్రమంలో రాష్ట్రంలో 9 నుంచి 12 వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ తమకు ఆసక్తి ఉన్న కెరీర్‌ను ఎంచుకునేందుకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. ఆసక్తి ఉన్న వృత్తుల గురించి పిల్లలు తెలుసుకుని అందుకు కృషి చేసేందుకు యునిసెఫ్, ఆస్మాన్‌ ఫౌండేషన్‌ సహకారంతో…. గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. విద్యార్థులు తమ గుర్తింపు సంఖ్య, పాస్‌వర్డ్‌లతో వెబ్‌సైట్‌లోకి వెళ్లి వారికి కావాల్సిన కెరీర్‌ వివరాలను తెలుసుకోవచ్చు.

ఇక ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ‘జగనన్న విద్యా కానుక’ను అక్టోబర్ 8న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలోని పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ‘జగనన్న విద్యా కానుక’ కిట్లలో స్కూల్ బ్యాగ్ తో పాటు మూడు జతల యూనిఫామ్స్, 1 జత షూ, 2 జతల సాక్సులు, బెల్ట్, పాఠశాల పుస్తకాలు, నోట్ బుక్స్ ఉంటాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటిసారి జగన్ సర్కార్ వర్క్ బుక్స్ కూడా అందజేయడం విశేషం. ఇక, యూనిఫాం కుట్టు కూలీ కూడా తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇలా విద్యార్థులకు ఉపయోగపడేలా పలు కీలక కార్యక్రమాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Also Read :

అక్రమ సంబంధం : భర్తను వదిలేసింది, నాలుగేళ్ల కుమారుడిని చంపేసింది

హైదరాబాద్‌లో పండుగ పూట రెచ్చిపోయిన దొంగలు..రూ.40 లక్షల విలువైన సెల్‌ఫోన్లను దోచేశారు

మేడపై నుంచి 14 రోజుల బిడ్డను కిందకు పడేసిన తల్లి..కనీసం కడుపు తీపి లేకుండా..?