హస్తినలో నివాసం యోగ్యమేనా.? ఢిల్లీని కబళిస్తున్న వాయు కాలుష్యం!

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. హస్తినలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా.. మొన్న దీపావళీ సందర్భంగా పేల్చిన టపాసుల ధాటికి మళ్ళీ కాలుష్యం తారాస్థాయికి చేరిందని చెప్పాలి. ఇక ఇప్పుడు అందరికి కూడా ఢిల్లీలో నివాసం నిజంగా యోగ్యమేనా అనే ప్రశ్న తలెత్తింది. అక్కడ పెరుగుతున్న పొల్యూషన్‌కు ఢిల్లీ ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా వాయు కాలుష్యం స్థాయి ప్రమాదకర […]

హస్తినలో నివాసం యోగ్యమేనా.? ఢిల్లీని కబళిస్తున్న వాయు కాలుష్యం!
Follow us

|

Updated on: Nov 01, 2019 | 11:48 PM

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. హస్తినలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా.. మొన్న దీపావళీ సందర్భంగా పేల్చిన టపాసుల ధాటికి మళ్ళీ కాలుష్యం తారాస్థాయికి చేరిందని చెప్పాలి. ఇక ఇప్పుడు అందరికి కూడా ఢిల్లీలో నివాసం నిజంగా యోగ్యమేనా అనే ప్రశ్న తలెత్తింది. అక్కడ పెరుగుతున్న పొల్యూషన్‌కు ఢిల్లీ ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా వాయు కాలుష్యం స్థాయి ప్రమాదకర స్థితికి చేరుతోందని చెప్పాలి. ఇటీవల సిరీస్ ఆడేందుకు వచ్చిన బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలో మాస్కులు వేసుకుని మరీ ప్రాక్టీస్ చేయడం గమనార్హం.

భారత్, బంగ్లాదేశ్ జట్లు నవంబర్ 3న ఢిల్లీ వేదికగా మొదటి టీ20 మ్యాచ్ ఆడనున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్‌కు కాలుష్యం అడ్డంకిగా మారింది. కాలుష్యం కోరల్లో ఆటగాళ్లు చిక్కుకుంటారని చాలామంది మ్యాచ్ వేదికను మార్చమని బీసీసీఐకి విజ్ఞప్తి చేయగా.. ఎటువంటి మార్పులూ కూడా ఉండవని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెగేసి చెప్పాడు. ఇక గతంలో కూడా శ్రీలంక ఆటగాళ్లు భారత్‌తో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో మాస్కులు ధరించి ఆడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సీన్ రెండు రోజుల్లో జరగబోయే మ్యాచ్‌కు కూడా రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది.

ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు.. అక్కడ నివాసం ఉండాలన్నా సామాన్యుడికి భయం పట్టుకుంది. పెరుగుతున్న రవాణా రీత్యా వాటి నుంచి వచ్చే పొగ.. పొరుగు రాష్ట్రల నుంచి పంట వ్యర్ధాల దగ్ధం.. ఇలా అన్ని కలిసి ఢిల్లీ గాలిని ప్రమాదకరంగా మార్చాయి. అటు సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే నవంబర్ 5 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మున్ముందు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.