Breaking: డ్రగ్స్ కేసు.. నలుగురు హీరోయిన్లకు ఎన్సీబీ నోటిసులు..

డ్రగ్స్ కేసు బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ కేసులో తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) నలుగురు హీరోయిన్లకు సమన్లు జారీ చేసింది.

Breaking: డ్రగ్స్ కేసు.. నలుగురు హీరోయిన్లకు ఎన్సీబీ నోటిసులు..
Follow us

|

Updated on: Sep 23, 2020 | 5:56 PM

డ్రగ్స్ కేసు బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ కేసులో తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) నలుగురు హీరోయిన్లకు సమన్లు జారీ చేసింది. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకోనే, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్‌తో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు సమన్లు ఇచ్చిన ఎన్సీబీ.. మూడు రోజుల్లో హాజరు కావాలని నోటిసుల్లో పేర్కొంది. (Drugs Probe)

కాగా, సుశాంత్ మృతి కేసులో బయటపడిన డ్రగ్స్ కోణంపై ఎన్సీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో బాలీవుడ్ ఇండస్ట్రీతో ఉన్న సంబంధాలపై ఇప్పటికే పలువురిని ఎన్సీబీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా దీపికా పదుకోనే మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ను ప్రశ్నించగా.. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read:

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..