ఇండియాలోనూ ‘కాలు మోపిన కరోనా’.. మొదలైన స్కానింగ్ టెస్టులు..
చైనాలో మొదలైన డెడ్లీ కరోనా వైరస్ మెల్లగా ప్రపంచ దేశాలను కబళించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఇండియా అప్పుడే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. శుక్రవారం 24,844 మందిప్రయాణికులకు స్క్రీన్ టెస్టులు నిర్వహించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రస్తుతం ఏడు విమానాశ్రయాల్లో స్కానింగ్ ఏర్పాట్లు చేయగా.. ఈ సౌకర్యాన్ని మరో 12 విమానాశ్రయాలకు పొడిగించినట్టు ఈ శాఖ వెల్లడించింది. ఈ ఎయిర్ పోర్టుల్లో ట్రావెల్ అడ్వైజరీ హెచ్చరిక బోర్డులను ఉంచారు. . కేరళలో ఏడుగురికి […]

చైనాలో మొదలైన డెడ్లీ కరోనా వైరస్ మెల్లగా ప్రపంచ దేశాలను కబళించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఇండియా అప్పుడే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. శుక్రవారం 24,844 మందిప్రయాణికులకు స్క్రీన్ టెస్టులు నిర్వహించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రస్తుతం ఏడు విమానాశ్రయాల్లో స్కానింగ్ ఏర్పాట్లు చేయగా.. ఈ సౌకర్యాన్ని మరో 12 విమానాశ్రయాలకు పొడిగించినట్టు ఈ శాఖ వెల్లడించింది. ఈ ఎయిర్ పోర్టుల్లో ట్రావెల్ అడ్వైజరీ హెచ్చరిక బోర్డులను ఉంచారు. . కేరళలో ఏడుగురికి ఈ వైరస్ సోకినట్టు భావించి వివిధ జిల్లాల్లోని ఆసుపత్రులకు తరలించారు. తిరువనంతపురం, త్రిచూర్, కొచ్చి. కోజికోడ్ నగరాల్లోని ఆసుపత్రులకు వీరిని షిఫ్ట్ చేశారు. మరో 72 మందిని వైద్య సంబంధ నిఘాలో ఉంచారు.
ఇక హైదరాబాద్ లో ఒకరు, ముంబైలో ముగ్గురికి ఈ వైరస్ లక్షణాలు స్వల్పంగా సోకినట్టు భావిస్తున్నారు. ముంబైలోని కస్తూర్బా ఆసుపత్రిలోను, ఢిల్లీలోని ఏఐఐఎంఎస్‌లో స్పెషల్ వార్డులను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
చైనాలో 41 కి చేరిన మృతుల సంఖ్య
చైనాలో కరోనా వైరస్ సోకి మృతి చెందినవారి సంఖ్య 41 కి పెరిగింది. వూహాన్ సిటీలోని ఆసుపత్రులన్నీ ఈ వైరస్ సోకిన రోగులతో నిండిపోయాయి. ఈ నగరాన్ని అన్ని వైపులనుంచి అధికారులు దిగ్బంధించారు. ఇక్కడివారిని బయటికి, బయటివారిని ఇక్కడికి అనుమతించడంలేదు.ఇక్కడ ఓ డాక్టర్… కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తూ మరణించారు. హాంకాంగ్ నగరంలో వైరస్ ఎమర్జెన్సీని ఆ ప్రాంత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రకటించారు.
అటు-యుఎస్, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, వియత్నాం, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, తైవాన్, నేపాల్, మలేసియా, ఫ్రాన్స్ దేశాల్లో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.