AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చే ఏడాది ‘సినీ సంక్రాంతి’కి పందెం కోళ్లు రెఢీ!

వచ్చే ఏడాది సంక్రాంతికి సినీ పందెం కోళ్లు రెడీ అయిపోయాయి. 2021 సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు నిలవనున్నారు. ఇద్దరూ స్టార్ హీరోలే కాబట్టి హోరాహోరీ పోటీ నెలకొనే అవకాశముందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తాజాగా.. సరిలేరు నీకెవ్వరుతో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ హిట్‌ సాధించారు మహేష్. ఇక ఆ నెక్ట్స్ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నారు. ‘జేమ్స్ బాండ్’ కథాంశంతో ఈ చిత్రం […]

వచ్చే ఏడాది 'సినీ సంక్రాంతి'కి పందెం కోళ్లు రెఢీ!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 25, 2020 | 7:40 PM

Share

వచ్చే ఏడాది సంక్రాంతికి సినీ పందెం కోళ్లు రెడీ అయిపోయాయి. 2021 సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు నిలవనున్నారు. ఇద్దరూ స్టార్ హీరోలే కాబట్టి హోరాహోరీ పోటీ నెలకొనే అవకాశముందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

తాజాగా.. సరిలేరు నీకెవ్వరుతో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ హిట్‌ సాధించారు మహేష్. ఇక ఆ నెక్ట్స్ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నారు. ‘జేమ్స్ బాండ్’ కథాంశంతో ఈ చిత్రం తెరక్కెక్కబోతుంది. ఇందులో మహేష్ జేమ్స్‌బాండ్ పాత్రలో నటించనున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ మే నెలలో స్టార్ట్ కానుంది. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయబోతున్నారట. అందులోనూ మహేష్ ‘శ్రీమంతుడు’ సినిమా నుంచి మొదలుకొని భరత్‌ అనే నేను, మహర్షి, ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా హిట్స్ కొడుతున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ యమ ఖుషీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చే ‘జేమ్స్ బాండ్’ చిత్రంపై కూడా భారీగానే అంచనాలను పెంచుకుంటున్నారు.

అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కూడా ‘టెంపర్’ సినిమా మొదలుకొని అన్నీ విజయాలే సాధిస్తున్నారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఏప్రిల్‌లో అయిపోతుంది. ఆ తరువాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా తీయనున్నారు. ఈ చిత్రం కూడా సంక్రాంతి రేసులో నిలుస్తుందని.. ఇదివరకే త్రివిక్రమ్ వెల్లడించారు. అటు మహేష్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామోలుగా లేదు. ఇక ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ గురించి చెప్పనవసరం లేదు. మరి వచ్చే ఏడాది సంక్రాంతి మొగుడు ఎవరో కానీ గట్టి పోటీనే నెలకొనేలా ఉందని అంటున్నారు.

కాగా.. ఈ ఏడాది సినీ సంక్రాంతికి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హడావిడి చేశాయి. ‘దర్బార్ సినిమాతో సూపర్ స్టార్ రజనీకాంత్, సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబు, అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్, ఎంతమంచి వాడవురా సినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్‌’లు సంక్రాంతి బరిలో నిలిచారు. అందులో మహేష్ బాబు సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

Follow Us
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం