దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఆస్తుల వేలం

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఆస్తులను వేలం వేయనున్నారు. మహారాష్ట్ర రత్నగిరిజిల్లాలోని వారి ఆస్తులను నవంబరు 10 న వేలం వేస్తామని 'స్మగ్లర్స్ అండ్ ఫారిన్ మానిప్యులేటర్స్...

దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఆస్తుల వేలం
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Oct 21, 2020 | 11:43 AM

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఆస్తులను వేలం వేయనున్నారు. మహారాష్ట్ర రత్నగిరిజిల్లాలోని వారి ఆస్తులను నవంబరు 10 న వేలం వేస్తామని ‘స్మగ్లర్స్ అండ్ ఫారిన్ మానిప్యులేటర్స్ (ఫోర్ ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ) యాక్ట్’ విభాగం అధికారులు తెలిపారు. ఈ విభాగం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన పని చేస్తోంది. రత్నగిరి లోని కొంకణ్ లో దావూద్ పూర్వీకులకు చెందిన  స్థిరాస్థులు ఉన్నాయి. అలాగే దావూద్ సహచరుడు, గ్యాంగ్ స్టర్ ఇక్బల్ మిర్చికి చెందిన రెండు ఫ్లాట్లను కూడా అదే రోజున వేలం వేస్తారు. వచ్ఛే నెల 2 న బిడ్డర్ల పరిశీలన జరుగుతుంది.