‘విక్రమాదిత్య’గా ప్రభాస్‌.. ‘రాధే శ్యామ్’‌ సర్‌ప్రైజ్‌ అదిరిపోయిందిగా

చెప్పినట్లుగానే ప్రభాస్ అభిమానులకు రాధే శ్యామ్ టీమ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది. మరో రెండు రోజుల్లో ప్రభాస్ పుట్టినరోజు రానుండగా

'విక్రమాదిత్య'గా ప్రభాస్‌.. 'రాధే శ్యామ్'‌ సర్‌ప్రైజ్‌ అదిరిపోయిందిగా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 21, 2020 | 12:58 PM

Radhe Shyam Surprise: చెప్పినట్లుగానే ప్రభాస్ అభిమానులకు రాధే శ్యామ్ టీమ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది. మరో రెండు రోజుల్లో ప్రభాస్ పుట్టినరోజు రానుండగా.. అతడికి అడ్వాన్స్‌ బర్త్‌డే విషెస్ చెబుతూ ఫస్ట్‌లుక్‌తో పాటు పాత్ర పేరును కూడా రివీల్ చేసింది. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్యగా కనిపించనున్నారు. ఫస్ట్‌లుక్‌లో కారుపై ఊబర్‌ కూల్‌లో లుక్‌లో డార్లింగ్‌ అదరగొడుతున్నారు. ఇక కారుపై ప్రభాస్ అని పేరు ఉండటం మరో విశేషం. మొత్తానికి ప్రభాస్ అభిమానులనే కాదు సినీ ప్రేక్షకులందరికీ ఈ లుక్‌ ఆకట్టుకుంటోంది.

కాగా రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న రాధే శ్యామ్‌ని పలు భాషల్లో వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. ఇక అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ పేరిట మోషన్ పోస్టర్ విడుదల కానుంది.

Read More:

జెనీలియా భర్త అనగానే నా ఈగో హర్ట్‌ అయ్యింది: రితేష్‌

మోసం చేస్తూ దొరికిన డెలివరీ బాయ్.. అరెస్ట్‌