బురేవి తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం.!
ఏపీపై బురేవి తుఫాన్ ఎఫెక్ట్ పడుతోంది. తుఫాను ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో..

Cyclone Burevi: ఏపీపై బురేవి తుఫాన్ ఎఫెక్ట్ పడుతోంది. తుఫాను ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక ఈ ఏడాది తిరుమలలో రికార్డు స్థాయిలో 1,750 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే అక్కడ అన్ని డ్యామ్‌లు నిండుకుండలను తలపిస్తున్నాయి.
కాగా, బురేవి తుఫాను తీరం దాటే సమయంలో సుమారు 70-80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే దాని ప్రభావం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇక ఈరోజు, రేపు చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Also Read:
Breaking: గ్రేటర్ దెబ్బ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం.. టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా..
కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. సర్వీసు గడువును పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ..
బిగ్ బాస్ 4: ఆ ఇద్దరూ టాప్ 2లో ఉండాలి.. పనికి రానోళ్లను తోసేయండి: రాహుల్ సిప్లిగంజ్
డార్క్ చాక్లెట్‌తో కరోనాకు చెక్ పెట్టొచ్చు.! తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి..
