Currency Bundles : పొద్దున్నే పంచాయతీ కార్మికులకు షాక్ ఇచ్చిన డబ్బులు.. చెత్త ఎత్తే కొద్దీ కరెన్సీ కట్టలు.. ఆపై
Currency Bundles :పొద్దున్నే తమ పని చేసుకుంటున్న పంచాయతీ కార్మికులు షాక్ తిన్నారు. ఓ బ్యాంక్ సమీపంలో డబ్బుల కట్టలు కనిపించాయి. అందులో ఎక్కువగా రెండు వేల నోట్లు ఉండడంతో దీంతో షాక్ తిన్నారు..
Currency Bundles :పొద్దున్నే తమ పని చేసుకుంటున్న పంచాయతీ కార్మికులు షాక్ తిన్నారు. ఓ బ్యాంక్ సమీపంలో డబ్బుల కట్టలు కనిపించాయి. అందులో ఎక్కువగా రెండు వేల నోట్లు ఉండడంతో దీంతో షాక్ తిన్నారు. మరి ఈ డబ్బుల కట్టలు గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ పంచాయతీ ఉండవల్లి సెంటర్ ఎస్‌బీఐ సమీపంలో దర్శనమిచ్చాయి. వివరాల్లోకి వెళ్తే..
ఎప్పటిలాగే స్థానిక పంచాయతీ కార్మికులు సోమవారం ఉదయం ఉండవల్లి సెంటర్‌లోని ఎస్‌బీఐ సమీపంలో చెత్తను తొలగిస్తున్నారు. ఇంతలో కార్మికులకు ఓ రూ.500నోటు కనిపించింది. ఈ రోజు లేచిన వేళ బాగుందంటూ దానిని దాచిపెట్టుకున్నారు. చెత్త తీసే కొద్దీ కట్టలు కట్టలు బయటపడడంతో ఆందోళన చెందిన పంచాయతీ కార్మికులు సచివాలయం సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మొత్తం అక్కడ ఉన్న చెత్త ఏరివేసేసరికి సుమారు 30 కట్టల నోట్లు కనిపించాయి. అందులో రూ.500,రూ.200, రూ.2వేల రూపాయలు ఉన్నాయి.
సమాచరం అందుకున్న పోలీసులు ఆ నోట్లను పరిశీలించారు. మొదట వాటిని దొంగనోట్లుగా భావించిన పోలీసులు బాగా పరిశీలిస్తే.. అప్పుడు నవ్వుకున్నారు. ఎందుకంటే ఆ నోట్ల మీద ‘చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’, ‘ఫర్ స్కూల్ జోన్ ఓన్లీ’ అని రాసి ఉంది. దీంతో అక్కడ నవ్వులతో నిండిపోయింది. మళ్లీ ఆ నోట్ల కట్టలను చెత్తలో పడేసి డంపింగ్ యార్డకు తరలించారు.
Also Read: అందమైన ఆ దేశంలో అసలు ఏం జరుగుతుంది.. బీచ్ లో శవాల గుట్టలు.. తలలు లేని మొండాలు
కరోనా నేపథ్యంలో హోలా మొహల్లాని ఆపాలని చూసిన పోలీసులు… దాడి చేసిన ప్రజలు
జబర్ధస్త్ షూటింగ్ సెట్లో టీమ్ లీడర్ల మధ్య గొడవ.. ఆత్మహత్య ప్రయత్నం చేసిన వర్ష..