CM YS Jagan : సీఎం జగన్మోహన్ రెడ్డి ‘స్పందన’ కార్యక్రమ వీడియో కాన్ఫరెన్స్, ఈ అంశాలపైనే మెయిన్ ఫోకస్..
CM Jagan review on Spandana : ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతిలో ఈ మధ్యాహ్నం ‘స్పందన’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.
CM Jagan review on Spandana : ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతిలో ఈ మధ్యాహ్నం ‘స్పందన’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ప్రధానంగా ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణంపై సీఎం అధికారుల్ని ప్రశ్నించారు.
అటు, పట్టణాల్లో మధ్య తరగతి ప్రజలకు ఇవ్వబోతోన్న ఇళ్ల స్థలాల లేఅవుట్లపై కూడా చర్చించారు. స్కూళ్లు, అంగన్‌వాడీల్లో నాడు–నేడు పనులపైనా, అంతే కాకుండా స్పందనకు వస్తున్న ఫిర్యాదులు, వాటి పరిష్కారంపై కూడా సీఎం ఆరాతీశారు. స్పందన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న స్పందనలపై కూడా జగన్ చర్చించారు. వైయస్‌ఆర్ చేయూత కార్యక్రమ ప్రగతి, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్ నిర్మాణంపైనా ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.
Read also : West Bengal elections : దక్షిణ 24 పరగణాల జిల్లాలో వెలుగుచూసిన 48 నాటు బాంబులు, దేశీయంగా తయారు చేసిన తుపాకీలు